రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీ టినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా సోమ వారం 9.53 టీఎంసీలకు పడిపోయాయని అధికా రులు తెలిపారు. గతేడాది ఇదేరోజు 8.99 టీఎంసీ ల నిల్వలు ఉన్నాయన్నారు. ప్రాజెక్టులోకి 114 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, హైదరాబాద్‌కు 316 క్యూ సెక్కులు, నంది పంపుహౌస్‌కు 2,100 క్యూసెక్కు లు, గూడెం పంపుహౌస్‌కు 290 క్యూసెక్కులు, వేంనూర్ పంపుహౌస్‌కు 247 క్యూసెక్కులు, రామగుండం ఎత్తిపోతలకు 90 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 58 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు.
క్వింటాల్ పత్తి రూ.7,979
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యా ర్డు ఆవరణలో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,979 ధర నమోదైందని చైర్మన్ కూరమల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,016గా, సగటు రూ.7,679గా ధర ఉందని వారు పేర్కొన్నారు.


