మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో మోడల్ జిల్లాగా పెద్దపల్లి గోదావరి పుష్కరాలకు నిధులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్. మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహావిష్కణ మంత్రులు అడ్లూరి, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ హాజరు
మంథని: అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయుడని, అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగారని, ఆయన మార్గంలో నడుద్దా మని సాంఘిక సంక్షేమ, గిరిజన, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. సోమవా రం శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా శ్రీపాదకాలనీలో గోవిందుల రమేశ్‌తోపాటు కాలనీవా సులు ఏర్పాటు చేసిన శ్రీపాదరావు విగ్రహాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభు త్వ విప్ విజయరమణారావు, రామగుండం ఎమ్మె ల్యే, డీసీసీ అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ప లువురు ప్రముఖులతో కలిసి ఆయన ఆవిష్కరించా రు. లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ, పేద, బడుగు, బ లహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన నేత శ్రీపాదరావు అని అన్నారు. అనేకమందికి మా ర్గనిర్దేశకులన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంతో పెద్దపల్లి జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సా ధిస్తోందని తెలిపారు. గోదావరి పుష్కరాల సంద ర్భంగా ధర్మపురితోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించేలా సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తామని, ఇందుకు సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు.
అభివృద్ధికి నిర్వచనం మంథని
పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్‌ఎస్ ప్రజల్ని ప ట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చి రెండే ళ్లలో ఏంచేశారని ప్రశ్నిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వచ్చేమూడేళ్లలో సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తిచేస్తామన్నారు. అభివృద్ధికి నిర్వచనం ఇవ్వాల నే కాంక్షతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పే దవారికి గూడు కల్పించాలని దివంగత మాజీ స్పీ కర్ శ్రీపాదరావు 25 ఎకరాలు కేటాయించారని అ న్నారు. పేదలు ఆయన పేరిట ఏర్పాటు చేసుకున్న కాలనీ పేరును మార్చాలని కొందరు యత్నించారని, కానీ, స్థానికులు స్వచ్ఛందంగా శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
పార్టీ.. ప్రభుత్వానికి ప్రజల అండ
శ్రీపాదరావు ఆశయాలను ఆయన తనయుడు శ్రీధ ర్‌బాబు ముందుకు తీసుకెళ్తున్నారని, ఆయన నా యకత్వంలో జిల్లాలో పార్టీ, ప్రభుత్వం ప్రజల అండతో మోడల్ జిల్లాగా రూపురేఖలు మారుతాయని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. అభి వృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
జిల్లాలో బలమైన నాయకత్వం
తెలంగాణలోనే బలమైన నాయకత్వం జిల్లాలో పనిచేస్తోందని, శ్రీపాదరావు లాంటి మహనీయుల స్ఫూర్తి ఇందుకు నిదర్శమని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. పేదలబాగు కోసం నిరంత రం తపించిన నేత శ్రీపాదరావు అన్నారు. మంథని నియోజకవర్గంలో చేపడుతున్న నాలుగు లేన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులు పెద్దపల్లి నియోజక వర్గం వరకు కూడా కొనసాగించాలని మంత్రి శ్రీధ ర్‌బాబును కోరారు. రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల గ్రంథా లయ సంస్థ చైర్మన్లు అన్నయ్యగౌడ్, కోట రాజబా పు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివా స్, వైస్ చైర్మన్ సహేందర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


