పరీక్షలు ముగియడంతో విజయకేతనం ఎగురవేస్తున్న విద్యార్థినులు
సామగ్రి పట్టుకుని ఇంటిదారి పట్టిన విద్యార్థులు
నెలరోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరిగిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఈసారి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగియడంతో హమ్మయ్య.. పరీక్షలు ముగిశాయంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు.. ఇప్పుడు ఎగిరి గంతులేశారు. ఒకరికొకరు బైబై చెప్పుకుంటూ ఇంటిదారి పట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కనిపించిన దృశ్యాలు ఇవి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


