గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ: త్రీఒక్కరు బాధ్యతతో డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాల ని యంత్రణ సాధ్యమని పెద్దపలి డీసీపీ రాంరెడ్డి అన్నారు. గోదావరిఖని, రామగిరి మండలం జల్లారం – సింగిరెడ్డిపల్లిలో సోమవారం నిర్వహించిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో గోదావ రిఖని ఏసీపీ రమేశ్‌తో కలిసి డీసీపీ మాట్లాడా రు. రాంగ్‌రూట్, మద్యం తాగి వాహనాలు న డపడం, సెల్‌ఫోన్ ఉపయోగించడం వంటి చ ర్యలను నివారించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామగుండం మేయర్ మహంకాళి స్వామి మాట్లాడా రు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారె డ్డి, సీఐ ప్రసాద్‌రావు, సర్పంచ్ యమున–శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు.
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
పెద్దపల్లి: జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్ర శాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధి కారి శారద తెలిపారు. సోమవారం చివరిరోజు సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించామన్నారు. 7,495 మంది విద్యార్థులకు 7485 మంది హాజరయ్యారని ఆమె వివరించారు.
డిగ్రీ కాలేజీలో ప్రేరణ సదస్సు
పెద్దపల్లిరూరల్: పల్లె ప్రాంత విద్యార్థులు జా తీయస్థాయి రక్షణదళాల్లో రాణించడం గర్వకారణమని ప్రభుత్వ డిగ్రీకాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య అన్నారు. కాలేజీలో సోమవారం ఎన్‌సీసీ కెరీర్ గైడెన్స్ విభాగాల ఆధ్వర్యంలో ప్రేర ణ సదస్సు నిర్వహించారు. పూర్వవిద్యార్థిని, ప్రస్తుత ఇండోటిబెటిన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ మీనాక్షికుమారి తన అనుభవాలను పంచుకున్నారు. జాతీయస్థాయిలో జరిగిన కఠిన శి క్షణ కాలంలో దాదాపు 700మంది శిక్షణార్థుల కు పరేడ్‌కమాండర్‌గా వ్యవహరించానని గుర్తుచేసుకున్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ల క్ష్యసాధన పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ కంజర్ల శ్రీలత, కెరీర్‌గైడెన్స్ కన్వీనర్ షుకూర్, వైస్‌ప్రిన్సిపాల్ సతీశ్‌కుమార్ తదితరులు మీనాక్షికుమారిని సత్కరించారు.
గురుకులం.. ప్రభంజనం
సుల్తానాబాద్‌రూరల్: దుబ్బపల్లి మైనార్టీ గురు కుల కళాశాల(కరీంనగర్ బాలురు– 3) ఇంట ర్ ఫస్టియర్‌లో 95శాతం, సెకండియర్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారు. ఫస్టియర్ ఎంఎల్‌టీలో ఎండీ షాదబుద్దీన్487, ఈటీలో షేక్ ఇర్ఫాన్ పాషా 493, సెకండియర్ ఎంఎల్‌టీలో ఎండీ రహేమాన్ 987, ఈటీలో అక్షిత్‌రెడ్డి 986 మార్కులు సాధించార ని ప్రిన్సిపాల్ చంద్రమోహన్ తెలిపారు. నాలుగేళ్లుగా ఇంటర్‌లో వందశాతం ఫలితాలను సా ధిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులను పలువురు అభినంధించారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
పెద్దపల్లి: జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎండదెబ్బ తగల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు వెళ్లొద్దన్నారు. అత్యవసరమైతే తలపై టోపీ ధరించాలని, గొడుగు వాడాలని, తరచూ నీరు, ఓఆర్‌ఎస్, మజ్జిగ, కొబ్బరినీరు వంటి ద్రవాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎన్టీపీసీకి ఫైర్ సర్వీస్
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ భద్ర త, అత్యవసర సామర్థ్యాలను పెంపు కోసం మ రో ఫైర్ సర్వీస్‌ను ప్రారంభించామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నా రు. సీఐఎస్‌ఎఫ్ అగ్నిమాపక విభాగానికి కొత్త ఫైర్ సర్వీస్‌ను కేటాయించగా సోమవారం ఆ యన ప్రారంభించి మాట్లాడారు. ప్లాంట్ ప్రాంగణంలో భద్రత, మౌలిక సదుపాయాలను మె రుగుపరచడానికి, అగ్నిప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇది ముఖ్యమైన ముందడుగు అని అన్నారు. కమాండెంట్ నవనీత్‌కౌర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.


