రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర సేవల కోసం నజరానా
ప్రమాదంలో గోల్డెన్ అవర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు
కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
సుల్తానాబాద్‌రూరల్: రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్‌ను సద్వినియోగం చేసుకుంటే బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పోలీసులు, సర్పంచ్ వీరగోని ర మేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై గర్రెపల్లిలో సోమవారం అవగాహన కల్పించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాతో కలిసి కలెక్టర్ కలెక్టర్ మాట్లాడారు. హిట్ అండ్ రన్ కేసులు, రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ప్రభుత్వం రూ.2 లక్షల సాయం అందిస్తోందన్నారు. గతేడాది జిల్లా లో దాదాపు 30మందికి సాయం అందించినట్లు కలెక్టర్ తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించేవారికి రూ.25వేల ప్రోత్సాహకం అందించనున్నట్లు ఆయన వివరించారు. చిన్ననిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాల బారినపడుతున్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఉంటాయని అన్నారు. అనంతరం రోడ్డు భద్రత పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ బషీరొద్దీన్, సీఐ సుబ్బారెడ్డి, అనిల్‌కుమార్, ఎస్సై చంద్రకుమా ర్, ఎంవీఐ మధు తదితరులు పాల్గొన్నారు.


