సత్వరమే అర్జీల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సత్వరమే అర్జీల పరిష్కారం

Apr 14 2026 8:40 AM | Updated on Apr 14 2026 8:40 AM

● అదనపు కలెక్టర్‌ వేణు ● ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరణ

పెద్దపల్లి: ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సత్వరమే పరిష్కరించా లని అదనపు కలెక్టర్‌ వేణు ఆదేశించారు. కలెక్టరేట్‌ లో సోమవారం జరిగిన ప్రజావాణి ద్వారా ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ధర్మారం మండలం కటికనపల్లికి చెందిన ఎండీ ఖాసిం.. సర్వే నంబర్‌ 1211/2లోని 14 గుంటలు ఆన్‌లైన్‌లో వేరే వ్యక్తి పేరిట ఉందని, తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని, పెద్దపల్లి మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన గండు రాజయ్య.. వీఎస్‌బీ బ్రిక్స్‌ నుంచి దుమ్ము, ధూళి, బూడిద తమ వ్యవసాయ భూమిలోకి రా కుండా చూడాలని, జూలపల్లి మండలం కుమ్మంకుంటకు చెందిన తమ్మననేని మధుకర్‌ యాదవ్‌.. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, రేకులషె డ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లిలో పాతపట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఉన్నా ధరణి పట్టాదార్‌ పాస్‌పుస్తకం రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స ర్పంచ్‌, పాలకవర్గం వినతిపత్రం అందజేసింది. జిల్లాలోని సహజ వనరులను కాపాడాలని జాతీయ బీసీ సంఘం నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల స్వామి వినతిపత్రం అందజేశారు. ఆయా అర్జీలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను వేణు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement