తహసీల్దార్‌ను నియమించాలి | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ను నియమించాలి

Apr 14 2026 8:40 AM | Updated on Apr 14 2026 8:40 AM

బీజేపీ రామగుండం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌కు విన్నవించిన మహిళా నేత

జ్యోతినగర్‌: రామగుండం తహసీల్దార్‌ కుర్చీ 20 రోజులుగా ఖాళీగా ఉండడంతో ప్రజలు.. ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కందు ల సంధ్యారాణి అన్నారు. రామగుండం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపా రు. ఖాళీ కుర్చీకి వినతిపత్రం అంటించారు. అనంతరం కలెక్టర్‌ కోయ శ్రీహర్షని కలిసి విన్నవించారు. నియోజకవర్గంలో పాలన గాడి తప్పిందన్నారు. సా మాన్యుడి గోడు వినే నాథుడే కరువయ్యారని ఆరోపించారు. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన త హసీల్దార్‌ కార్యాలయం తహసీల్దార్‌ లేక వెలవెలబోతోందన్నారు. అంతర్గాం తహసీల్దార్‌ కార్యాల యం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని ధ్వజమెత్తారు. ఈ దారుణ పరిస్థితులను తొలగించేందుకు ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తహసీల్దార్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు సు ల్వ లక్ష్మీనరసయ్య, పద్మ, నరసయ్య, బోడకుంటి సుభాష్‌, ఊరకొండ అపర్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement