
ప్రతీ సమస్య మరణానికి కారణం కావద్దు
కోల్‌సిటీ(రామగుండం): ప్రతి ఇంట్లో, కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుందని, ప్రతీ సమస్య మరణానికి కారణం కావద్దని డీఎంహెచ్‌వో వాణిశ్రీ అన్నారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కెమిస్ట్‌భవన్‌లో గురువారం నగరంలోని ఆరు యూపీహెచ్‌సీ, పీహెచ్‌ల మెడికల్ ఆఫీసర్లు, హెచ్‌ఈవో, సీవోలు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. చాలా మంది క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోతున్నారని, స్టూడెంట్స్ కూడా పరిష్కారం దొరకక సూసైడ్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, దీనిపై ప్రజ లకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రో గ్రాం ఆఫీసర్లు రాజమౌళి, సుధాకర్‌రెడ్డి, బండి కిరణ్, శ్రీరాం, లక్ష్మీ, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.