
సొంతిల్లే కావాలి
రామగిరి(మంథని): సింగరేణి నిర్మించనున్న డబు ల్ బెడ్రూమ్ ఇళ్లు వద్దని, తమకు సొంతింటి పథక మే అవసరమని మెజారిటీ కార్మికులు తమ అభి ప్రాయం వెల్లడించినట్లు సీఐటీయూ నేతలు ప్రకటించారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకా రం కోసం సీఐటీయూ శుక్రవారం ఆర్జీ–3 ఏరియా లో బ్యాలెట్ ఉద్యమం చేపట్టింది. ‘సొంత ఇల్లు కావాలా, సింరేణి క్వార్టర్ కావాలా’ అనే విషయంపై బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ ద్వారా కార్మికుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా మొత్తం 1,927 ఓట్లు పోలయ్యాయి. అందులో 1,910 మంది కార్మికులు సొంత ఇళ్లు కావాలని, 15 మంది క్వార్టర్లు కావాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో ఇద్దరి ఓట్లు చెల్లుబాటు కాలేదు. యూనియన్లకు అతీతంగా ‘నివాస క్వార్టర్ వద్దు.. సొంతిల్లు ముద్దు’ నినాదంతో చేపట్టిన ఓటింగ్‌లో పెద్దసంఖ్యలో పాల్గొంటున్న కార్మికులకు అభినందనలని సీఐటీయూ నాయకులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెంట్ రూపంలో రూ.కోట్లు చెల్లిస్తున్నా కార్మికుల సొంతిళ్లు అమలు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నందుకే కార్మికుల అభిప్రాయ సేకరణ, బ్యాలెట్ ఓటింగ్ చేపట్టామని వారు వివరించారు. నాయకులు కుమార్, వేణుగోపాల్, ప్రభాకర్, సత్తయ్య, శ్రీనివాస్, గోపాల్, విజయకుమార్‌రెడ్డి, రాజేశ్, విజేందర్‌రెడ్డి, రాజేశం పాల్గొన్నారు.