
పింఛన్ పోరు
500 శాతం పెంచాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫారసు అయినా, కనీస పింఛన్ రూ.వెయ్యి దాటని వైనం కోల్‌కతా వేదికగా ఉద్యమం సిద్ధమవుతున్న రిటైర్డ్ గని కార్మికులు సింగరేణిలో 8 వేల మంది, దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది మాజీ ఉద్యోగులు
తప్పని తిప్పలు
కమాన్‌పూర్ పీఏసీఎస్ ఎదుట..
సుల్తానాబాద్ ప్యాక్స్ ఎదుట బారులు తీరిన రైతులు
ఎలిగేడు మండలం ధూళికట్టలో..
కమాన్‌పూర్(మంథని): జిల్లారైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. వరి పంటకు ప్రస్తుతం యూరియా వేయడం తప్పనిసరైంది. గడువు మీరితే దిగుబడిపై తీవ్రప్రభావం చూపే
అవకాశం ఉంది. అందుకే అన్నదాతలు నిద్రలేచింది మొదలు సింగిల్‌విండోలు, గ్రోమోర్ సెంటర్లు, ప్రైవేట్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. శుక్రవారం కూడా
ఆయా ప్రాంతాల్లో రైతులు పడిగాపులు కాయడం కనిపించింది.
ప్రజాసమస్యల్ని వెలుగులోకి తెస్తున్న సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగానే సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు జర్నలిస్ట్‌లపై అక్రమంగా కేసులు బనాయిస్తూ భయాందోళనలకు గురిచేస్తోంది. ఏపీ ప్రభుత్వ దురాగతాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని పలువురు సీనియర్ జర్నలిస్ట్‌లు కోరుతున్నారు.
– గోదావరిఖని
గోదావరిఖని: పింఛన్ పెంచా లనే డిమాండ్‌తో సింగరేణితో పాటు దేశంలోని బొగ్గుగని రిటై ర్డ్ కార్మికులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈనెల 15న కోల్‌కతా లోని కోలిండియా ప్రధాన కార్యాల యం ఎదుట ధర్నా చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు అక్కడకు తరలివెళ్తున్నారు. తమకు ఆర్థిక భద్రత, వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బొగ్గు గనుల రిటైర్డ్ ఉద్యోగులకు కోల్‌మైన్స్ పింఛన్ స్కీం–1998 ప్రకారం 27 ఏళ్ల క్రితం కనీస పింఛన్ రూ.350గా నిర్ణయించా రు. అనేక ఉద్యమాల తర్వాత గతేడాది మార్చి 9 నుంచి కనీస పింఛన్ రూ.వెయ్యికి పెంచారు. సింగరేణివ్యాప్తంగా రూ.వెయ్యి పింఛన్ పొందే రిటైర్డ్ కార్మికులు సుమారు 8వేల మంది వరకు ఉన్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా కరువు భత్యం లేని పింఛన్ పెరగకపోవడంతో దేశవ్యాప్తంగా ఉమారు ఐదు లక్షల మంది పింఛన్‌దారులు దారిద్య్రరేఖకు దిగువున బతుకుతున్నారని అంచనా.
విన్నవించినా ప్రయోజనం లేకనే..
పింఛన్ మొత్తం పెంచాలని, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ప్రయోజనం లేదంటూ రిటైర్డ్ కార్మికులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ప్రతిపాదించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫారుసులు కూడా అమలు కావడం లేదంటున్నారు. 2007కు ముందు రిటైర్డ్ ఉద్యోగులకు 500శాతం పింఛన్ పెంచాలని, వినియోగదారుల ధర సూచికను బట్టి కరువు భత్యంతో కూడిన పింఛన్ కోసం ప్రతీఐదేళ్లకోసారి పింఛన్ సవరణ చేయాలని, కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ను రద్దు చేసి బొగ్గు మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ, కో లిండియా, సింగరేణి, పింఛన్ ఫండ్ రెగ్యులేరిటీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీ య పింఛన్ ఫండ్ ఏర్పాటు చేయాలని రిటైర్డ్ బొగ్గు గని కార్మికులు కోరుతున్నారు. కోల్‌ఇండియా, సింగరేణి వార్షిక లాభాల్లో 2 శాతం నుంచి 3 శాతం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కేంద్ర బడ్జెట్‌లో కోల్ పింఛన్ ఫండ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్‌మైన్స్ పింఛన్ పెంచాలని, రిటైర్డ్ ఉద్యో గులు, అధికారులకు ఒకేరకమైన వైద్యావిధానం అమలుపర్చాలని, మెడికల్ బిల్లుల్లో రీయింబర్స్‌మెంట్ చెల్లింపులో జాప్యం నివారించాలని రిటైర్డ్ ఉద్యోగులుకోరుతున్నారు. ఇవేడిమాండ్లపై ఈనెల 15న కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శనకు సమాయత్తమవుతున్నారు. దీనికి సింగరేణి నుంచి రిటైర్డ్ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలివెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం పత్రికా స్వేచ్ఛను కల్పించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఇందు లో భాగంగానే సాక్షి దినపత్రిక ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఈనేపథ్యంలో ‘సాక్షి’పై క్షక్షగట్టి కేసులు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
– గుడ్ల శ్రీనివాస్,అధ్యక్షుడు,
ప్రెస్‌క్లబ్, పెద్దపల్లి
ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి
ప్రజాస్వామ్యానికి పత్రికలు మూలస్తంభాలు. ప్ర జలు, ప్రభుత్వానికి వార ధిగా ఉంటాయి. వాటిని ప్రజాస్వామ్యవాదులు గౌ రవించాలి. ప్రజల కోసం పనిచేస్తున్న పత్రికల గొంతు నొక్కడం సరికాదు. పత్రికలు నిర్భయంగా వాస్తవాలు వెల్లడిస్తేనే ప్రజాసమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న ‘సాక్షి’ఎడిటర్‌పై అక్రమ కేసులు నమోదు చేయడం శ్రేయస్కరం కాదు.
– మల్లావఝుల వంశీ,
జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే
కేసులతో భయపెట్టలేరు
సాక్షి దినపత్రిక ఎడిటర ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తోంది. దీనిద్వారా ఒక్క్కసిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని కాళోజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. తప్పులను సరిద్దిద్దుకోవాల్సిన ప్రభుత్వం.. అక్రమ కేసులతో భయపెట్టాలని చూడడం దుర్మార్గం. – అంకరి కుమార్,
అధ్యక్షుడు, ప్రెస్‌క్లబ్, మంథని
కక్షసాధింపు సరికాదు
ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు పత్రికలు. వాటిపై కక్షసాధింపు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ తోపాటు జర్నలిస్టులపై పోలీసులు కేసు నమోదు చేయడం శోచనీయం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పత్రికలను గౌరవించాలి.
– పూదరి కుమార్, అధ్యక్షుడు,
ప్రెస్‌క్లబ్, గోదావరిఖని

పింఛన్ పోరు

పింఛన్ పోరు

పింఛన్ పోరు

పింఛన్ పోరు

పింఛన్ పోరు

పింఛన్ పోరు

పింఛన్ పోరు

పింఛన్ పోరు

పింఛన్ పోరు