
ఆలిండియా రెస్క్యూ పోటీలకు ఎంపిక
గోదావరిఖని: రెండు రోజులపాటు నిర్వహించిన సింగరేణిస్థాయి రెస్క్యూ పోటీల్లో సత్తా చాటిన సభ్యులను ఆలిండియా రెస్క్యూ పోటీలకు ఎంపిక చేశారు. ఈమేరకు శుక్రవారం రెండు పురుషుల జట్లలో 16మంది, ఒక మహిళా జట్టులో 8మంది పేర్లతో కూడిన జాబితాను అధికారులు విడుదల చేశారు.
పురుషుల జట్టులో..
ఆలిండియా రెస్క్యూ పోటీల్లో పాల్గొనే పురుషుల జట్టులోని సభ్యులు : చీర్లంచ రమేశ్(ఫిట్టర్), ఎన్.భానుప్రసాద్(ఓవర్‌మెన్), గుజ్జుల రాకేశ్(జేఎంఈటీ), పిక్కల కుమారస్వామి(జనరల్ అసిస్టెంట్), ఆబాల శ్యాంకుమార్(జేఎంఈటీ), జె.మురళి(సీనియర్ మైనింగ్ సర్ధార్), జి.శషాంక్(ఓఎం), గెల్లు పరమేశ్(సీనియర్ అండర్ మేనేజర్), సీహెచ్ శ్రీవిఘ్నాన్(బదిలీ వర్కర్), సామల మధుసూదన్‌రెడ్డి(ఓవర్‌మెన్), జి.ప్రమోద్‌కుమార్(ఎంజీటీ), ఆర్.అజయ్(సీనియర్ మైనింగ్ సర్ధార్), గౌస్‌పాషా(ఎంజీటీ), ఆర్.సురేశ్(జనరల్ అసిస్టెంట్), బి.నితిన్‌కుమార్(ఎంజీటీ), ఎస్.శ్రీనివాస్‌రెడ్డి(షార్ట్‌ఫైరర్) ఉన్నారు.
మహిళా జట్టులో..
ఎంజీటీ ట్రెయినీలు: అంబటి మౌనిక, మాలోతు అనూష, వీసం కృష్ణవేణి, లక్కం స్వాతి, శ్రీరాం స్వాతి, బానోతు చందన జవేరి, చల్లా గాయత్రి, డి.షైనీ.