
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు పనులు వెంటనే ప్రారంభించేలా అధికారు లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణంపై సమీక్షించారు. జిల్లాలో చేపట్టిన నిర్మాణాలను నూరుశాతం పూర్తిచేయాలన్నారు. ఈజీ ఎస్ ద్వారా చేపట్టిన పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల పనులు వేగవంతం చేయాలని ఆయన అన్నారు. ఇదేసమయంలో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ పోస్టర్ ఆవిష్కరించారు.
యువతకు ఉపాధి అవకాశాలు..
యువత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. టీజీ ఐ పాస్ కింద పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేస్తే పరిశీలించి గడువులోగా అనుమతులివ్వాలని ఆదేశించారు. టామ్‌కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగా వకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప కడ్బందీ అమలు చేయాలని ఆదేశించారు. వానాకాలం వడ్ల కొనుగోలుకు ఇప్పట్నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఏ– గ్రేడ్ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లిస్తామన్నారు.
రామగుండం అభివృద్ధిపై సమీక్ష
రామగుండంలో చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ప నుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. జెడ్పీ సీఈ వో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, హౌసీంగ్ పీడీ రాజేశ్వర్‌రావు, డీఎస్‌వో శ్రీనాథ్, జిల్లా సహ కార అధికారి శ్రీమాల, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో రవీందర్, ఆర్‌అండ్‌బీ ఈఈ భా వ్‌సింగ్, డీపీవో వీరబుచ్చయ్య, ఈఈ గిరీశ్‌బాబు, ఈఈ రామన్ తదితరులు పాల్గొన్నారు.