అభివృద్ధిపై ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపై ఆందోళన వద్దు

Sep 14 2025 6:08 AM | Updated on Sep 14 2025 6:08 AM

అభివృ

అభివృద్ధిపై ఆందోళన వద్దు

రామగుండం: అభివృద్ధి పనులపై ఆందోళన వద్దని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అ న్నారు. చిరువ్యాపారుల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. అభివృద్ధికి అడ్డుగా ఉన్న జెన్‌కో క్వార్టర్లను కూల్చివేస్తామన్నారు. పట్టణంలోని ప్రధాన వీధిలో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం జెన్‌కో ఎస్‌ఈ శంకరయ్యతో కలిసి పరిశీలించారు. తనతల్లిదండ్రులతో కలిసి నివా సం ఉన్న జెన్‌కో క్వార్టర్‌ను పరిశీలించి బాల్యం జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

‘ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’

గోదావరిఖని: ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కూల్చివేతలు.. ఇలా రామగుండంలో రాక్షసపాలన సాగుతోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్‌ ఆరోపించారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాలు ఎమ్మెల్యే కు చుట్టాలుగా మారాయన్నారు. 21నెలలుగా అరాచకపాలన సాగుతోందన్నారు. కూల్చివేత ల పేరిట చిరువ్యాపారులను రోడ్డున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. నేపాల్‌లోఅరాచక పాలనను భరించలేక ప్రధానిని గద్దె దింపారని, రా మగుండంలోనూ ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని చందర్‌ సూచించారు. కూల్చివేతల నేపథ్యంలో ఈనెల15న పట్టణ బంద్‌ పాటిస్తామని, చలో కలెక్టరేట్‌ చేపడతామని ఆయన ప్ర కటించారు. కార్యక్రమంలో నాయకులు కౌశిక్‌ హరి, కుమ్మరి శ్రీనివాస్‌, గాధం విజయ, బాదె అంజలి, బొడ్డు రవీందర్‌, నారాయణదాసు మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్‌, గుంపుల లక్ష్మి, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

‘అది అవినీతి యూనియన్‌’

జ్యోతినగర్‌(రామగుండం): రెండు పర్యాయా లు గుర్తింపు యూనియన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎ.ముత్యంరావు ఆరోపించారు. ప్ర తీపనికి ఒక రేటు నిర్ణయించే దౌర్భాగ్య స్థితికి దిగజారిందన్నారు. ఐఎన్‌టీయూసీ, ఎన్టీపీసీ యాజమాన్యం చేతులు కలిపి అవినీతిలో కూ రుకుపోయారని మండిపడ్డారు. ఎన్టీపీసీ పర్మి నెంట్‌ టౌన్‌షిప్‌లో శనివారం ఆయన ఎన్నికల కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. ఈనె ల 25న జరిగే ఎన్టీపీసీ ఉద్యో గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఐటీయూను గెలిపించాలని కోరా రు. నాయకులు ఎన్‌.భిక్షపతి, సీహెచ్‌ ఉపేంద ర్‌, రామాచారి, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంక ర్‌, భూమయ్య, రాజేశ్వర్‌, సారయ్య, కుమార్‌, వీరయ్య, గణేశ్‌, అశోక్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

జిల్లాకు పీఎం విశ్వకర్మ కిట్లు

పెద్దపల్లిరూరల్‌: చేతివృత్తి పనులు చేసుకునేందుకు అవసరమైన పనిముట్లను అందించేందు కు కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పీఎం వి శ్వకర్మ యోజన పథకం ద్వారా ఎంపికై న లబ్ధి దారులకు కిట్లను అందిస్తోంది. జిల్లాలో ఎంపికై న వారికి అవసరమైన కిట్లు స్థానిక హెడ్‌పోస్టాపీసుకు చేరాయి. వాటిని త్వరలోనే అందించనున్నట్లు అధికారులు తెలిపారు. చేతివృత్తుల (వడ్రంగి, సుతారి, స్వర్ణకారులు, కుమ్మరి, క మ్మరి తదితర) పనివాళ్లకు పీఎం విశ్వకర్మ ద్వారా రూ.3లక్షలను (తొలివిడత రూ.లక్ష, మ లివిడతలో రూ.2లక్షలు) రుణంగా తక్కువ వ డ్డీకే అందిస్తున్న విషయం తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా గతేడాది సెప్టెంబర్‌ 17న ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు.

17 నుంచి సేవా పక్వాడా

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబ రు 2వ తేదీ వరకు చేపట్టే సేవా పక్వాడా కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి కోరారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన బీజేపీ ముఖ్య కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నాయ కులు కందుల శ్రీనివాస్‌, మిట్టపల్లి ప్రవీణ్‌, క డారి అశోక్‌రావు, సౌదరి మహేందర్‌ యాదవ్‌, కొమ్ము తిరుపతియాదవ్‌, రఘుపతిరావు, చా తరాజు రమేశ్‌, సంతోష్‌, నాగేశ్వర్‌ ఉన్నారు.

అభివృద్ధిపై ఆందోళన వద్దు 1
1/3

అభివృద్ధిపై ఆందోళన వద్దు

అభివృద్ధిపై ఆందోళన వద్దు 2
2/3

అభివృద్ధిపై ఆందోళన వద్దు

అభివృద్ధిపై ఆందోళన వద్దు 3
3/3

అభివృద్ధిపై ఆందోళన వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement