
రాజీ పడితేనే మంచిది
మంథని: రాజీకి అవకాశం ఉన్న కే సులను కక్షిదారు లు రాజీ చేసుకోవచ్చని, ఒకసారి లోక్ అదాలత్‌లో కేసు రాజీ చేసుకుంటే ఇరుపక్షాలు పైకోర్టుకు వెళ్లే అ వకాశం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీ త కుంచాల అన్నారు. స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌తో జడ్జి మాట్లాడారు. క్రిమినల్, కుటుంబ తగాదాలు, సివిల్ దావాలు, చెక్‌బౌన్స్, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు వంటి కే సులు లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. కేసు పరిష్కారమైతే మానసికంగా ప్రశాంతంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మంథనిలో 271 కేసులు పరిష్కారమయ్యాయి. నందిమేడారంలో 154తోపాటు పెద్దపల్లి, గోదావరిఖని, జూలప ల్లిలోనూ పలు కేసులు పరిష్కారమయ్యాయి. సీని యర్ సివిల్ జడ్జి భవాని, అడిషనల్ జూనియర్ సివి ల్ జడ్జి సుధారాణి, ద్వితీయ శ్రేణి న్యాయాధికారి అ నురాధ, ఆర్డీవో సురేశ్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, తహసీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు.