
● సమస్యలు పరిష్కరించాలని పలువురి విన్నపం
రామగుండం: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణణ్ శనివా రం స్థానిక రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అధికారులతో కలిసి ప్రత్యేక రైలులో వారు రామగుండం చేరుకున్నారు. రూ.24 కోట్లతో చేపట్టిన రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు పరిశీలించారు. ఆ ర్జీ–2లోని ఓసీపీ–3ని సందర్శించారు. బొగ్గు ర వాణాపై సింగరేణి అధికారులతో సమీక్షించారు. కాగా, ఈనెల 25న రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తార ని తెలిసింది. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి, రైల్వే ప్రజా సంబంధాల ప్ర తినిధి అనుమాస శ్రీనివాస్ తదితరులు జీఎం శ్రీవాస్తవకు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కుందనపల్లి, పెద్దంపేట రైల్వే ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్‌ల విషయమై వినతిపత్రం అందజేశారు. కుందనపల్లి రైల్వేగేట్ టెండర్ పూర్తిచేయించాలని కోరారు. ఆటోల పార్కింగ్ ఫీజు మినహాయించాలని విన్నవించారు. నవజీవన్, స్వర్ణజయంతి, మిలీనియం, గంగా – కావేరి, గరీబ్‌రథ్, కర్ణాటక సంపర్క్ క్రాంతి, జైపూర్ తదితర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ క ల్పించాలని కోరారు. పలు యూనియన్ల ప్రతినిధులు ఓవై స్వామి, రాథోడ్ ఆనంద్, వీరన్న, మోజెస్, అజ్మీరా వీరన్ననాయక్ పాల్గొన్నారు.
పెద్దపల్లి రైల్వేస్టేషన్ సందర్శన
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జంక్షన్‌ను సౌత్ సెంట్ర ల్ రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ, డీఆర్‌ఎం రాధాకృష్ణ సందర్శించారు. అభివృద్ధి పను లను పరిశీలించారు. డీఆర్‌యూసీసీ సభ్యుడు నారాయణదాస్ తివారీ తదితరులు జీఎం శ్రీవాత్సవను సత్కరించి సమస్యలను విన్నవించారు.