
జర్నలిస్ట్‌లపై దాడితో సమాజానికి నష్టం
పత్రికలు, జర్నలిస్ట్‌లను సమాజం కాపాడుకోవాలని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభు త్వ కక్ష సాధింపు సరికాదన్నారు. ‘సాక్షి’ ఎడి టర్ ధనంజయరెడ్డితోపాటు జర్నలిస్ట్‌లపై అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తోందని, ఏపీ ప్రభుత్వ నిరంకుశవైఖరిని ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాలు ఖండించాలంటున్నారు. – గోదావరిఖని
ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు
ప్రజాస్వామ్యంలో పత్రికలపాత్ర కీలకం. వ్యతిరేకంగా వార్తలు రాశారని పోలీ సులు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణి మానుకోవాలి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్ట్‌లపై కేసులు విరమించుకోవాలి.
– వాసిరెడ్డి సీతారామయ్య,
అధ్యక్షుడు, ఏఐటీయూసీ
వాస్తవాలు వెలికితీసేవి పత్రికలు
వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచే పత్రికలకు గౌరవం, స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజల స్వరాన్ని వినిపించే అవకాశం పత్రికలకు మాత్రమే ఉంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
– తుమ్మల రాజారెడ్డి,
అధ్యక్షుడు, సీఐటీయూ
వేధింపులు సరికాదు
నిజాలను నిర్భయంగా రాసే సాక్షి దినపత్రికపై వేధింపులు తగవు. అన్నిపార్టీలు, ప్రజల మనోగతాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత పత్రికలపై ఉంది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాశారని ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. – జనక్‌ప్రసాద్, సెక్రటరీ జనరల్,
ఐఎన్‌టీయూసీ
వాస్తవాలు బయట పెట్టేవే..
వాస్తవాలను బయట పెట్టేవే పత్రికలు. వాటిని బతికించుకోవాల్సిన అవసరం సమాజానికి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికలతోనే ప్రజలకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. సాక్షి ఎడిటర్, జర్నలిస్ట్‌లపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలి.
– రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు, హెచ్‌ఎంఎస్
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరి పై ఉంది. ప్రతీఅంశంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతున్నారనే అక్కసుతోనే కేసులు నమోదు చేయడం సరికాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలి.
– మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు, టీబీజీకేఎస్
కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, జర్నలిస్ట్‌లపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతోంది. ఈవిషయంలో కేంద్రప్రభుత్వం స్పందించాలి. పత్రికాస్వేచ్ఛను కాపాడాలి. అన్యాయాల్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటు.
– యాదగిరి సత్తయ్య, అధ్యక్షుడు, బీఎంఎస్

జర్నలిస్ట్‌లపై దాడితో సమాజానికి నష్టం

జర్నలిస్ట్‌లపై దాడితో సమాజానికి నష్టం

జర్నలిస్ట్‌లపై దాడితో సమాజానికి నష్టం

జర్నలిస్ట్‌లపై దాడితో సమాజానికి నష్టం

జర్నలిస్ట్‌లపై దాడితో సమాజానికి నష్టం

జర్నలిస్ట్‌లపై దాడితో సమాజానికి నష్టం