
గొర్రెల స్కాంపై విజిలెన్స్ విచారణ
పెద్దపల్లిరూరల్: బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై రాష్ట్రంలో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.. శనివారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్ధక శాఖ కా ర్యాలయంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ల బ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయడం, దాని రికార్డులు పరిశీలించారు. కొన్నింటిని జిరాక్స్ తీసుకుని వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.
మేడిపల్లి ఓసీపీ సందర్శన
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని మూసివేసిన మేడిపల్లి ఓసీపీని టీజీ ఎన్‌డీపీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఓసీపీలో చేపట్టిన పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్‌ప్రాజెక్ట్ గురించి వివరాలను సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్జీ –వన్ జీఎం లలిత్‌కుమార్ ప్రాజెక్టు వ్యూపాయింట్ వద్ద మ్యాప్ చూపించారు. పంప్‌డ్ స్టోరేజ్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరలింపు, ఖర్చు, గ్రిడ్ కనెక్టివిటీపై అధికారులతో చర్చించారు. అధికారులు ఆంజనేయప్రసాద్, జితేందర్‌సింగ్, రమేశ్, వీరారెడ్డి, మల్లికార్జున్ యాదవ్, గంగాధర్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
రోడ్డుపైనే ఇసుక లారీలు
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి – తాడిచెర్ల మానేరు క్వారీ నుంచి ఇసుక తరలించే లారీలు శనివారం రోడ్డుపైనే నిలిచాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రయాణికులు ఇబ్బంది ప డ్డారు. దుమ్ము, ధూళితో స్థానికులు అనారో గ్యం బారినపడుతున్నారు. రోడ్డుపై లారీలు ఎందుకు నిలుపుతున్నరని స్థానికులు ప్రశ్నిస్తే.. క్వారీ నిర్వాహకులు లారీల్లో ఇసుక నింపడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ పేరిట అక్రమంగా వస్తున్న లారీల్లో ఇసుక నింపుతూ, రోజుల తరబడి వేచిఉన్న తమ లారీల్లో ఇసుక నింపడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్య క్తం చేశారు. క్వారీ బాధ్యులు అదనంగా డబ్బు లు తీసుకుంటూ అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నారని డ్రైవర్లు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
సక్సెస్ సాధించాలి
మంథనిరూరల్: విద్యార్ధి దశలో విజయం సా ధించాలంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకుసాగాలని జిల్లా విద్యాధికారి మాధవి సూ చించారు. ఎగ్లాస్‌పూర్ జెడ్పీ హైస్కూల్‌ను శనివారం ఆమె సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పదోతరగతి పరీక్షల్లో వందశాతం మార్కులు సాధించేలా కష్టపడాలని డీఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం జి.జ్యోతి, ఉపాధ్యాయులు దొమ్మటి రవి, సంతోష్‌కుమార్, సుచిత్ర, శ్రీనివాస్, రాజశేఖర్, మంజుల పాల్గొన్నారు.
తప్పుడు డీఎస్‌ఆర్ పంపించొద్దు
ధర్మారం(ధర్మపురి): గ్రా మ పంచాయతీ కార్యదర్శు లు డైలీ శానిటేషన్ రిపోర్టు(డీఎస్‌ఆర్) పంపిస్తే కఠిన చ ర్యలు తీసుకుంటామని జి ల్లా పంచాయతీ అధికారి వీ రబుచ్చయ్య హెచ్చరించా రు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 263 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని, ఇందులో ఆరుగురు తప్పుడు డీఎస్‌ఆర్ అప్‌లోడ్ చేశారని ప్రాథమి కంగా తేలిందని తెలిపారు. వీరికి షోకాజ్ నోటీసులు జారీచేశామన్నారు. గ్రామాల్లో చేపట్టే అ భివృద్ధి పనులపై 4 ఫొటోలు తీసుకుని ఆన్‌లైన్‌లో పారదర్శకంగా అప్‌లోడ్ చేయాలని సూ చించారు. జిల్లాలో పనిచేసే 1,485 మంది పా రిశుధ్య కార్మికులు ఉదయం 6 గంటలకే విధు లకు హాజరు కావాలని ఆదేశించారు. ట్రేడ్‌లైసెన్స్ లేని దుకాణాలను సీజ్ చేస్తామని హె చ్చరించారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, మండల పంచాయతీ అధికారి రమేశ్ పాల్గొన్నారు.

గొర్రెల స్కాంపై విజిలెన్స్ విచారణ

గొర్రెల స్కాంపై విజిలెన్స్ విచారణ

గొర్రెల స్కాంపై విజిలెన్స్ విచారణ