అల్ఫోర్స్‌ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్‌బుక్‌లో చోటు | - | Sakshi
Sakshi News home page

అల్ఫోర్స్‌ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్‌బుక్‌లో చోటు

Jun 18 2025 3:37 AM | Updated on Jun 18 2025 3:47 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ టెక్నో స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న బుక్క దీత్య ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో సుమారు 2,400 మందికి పైగా కళాకారులతో కలిసి పాల్గొని ప్రతిష్ఠాత్మక గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు కై వసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమన్నారు. విద్యార్థినిని మంగళవారం స్థానిక పాఠశాలలో ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.

అపోలో రీచ్‌లో నూతనంగా గ్యాస్ట్రో, లివర్‌ చికిత్సలు

కరీంనగర్‌టౌన్‌: నగరంలోని అపోలో రీచ్‌ హాస్పిటల్‌లో నూతనంగా గ్యాస్ట్రోఎంటరాలజీ, లివర్‌ డిసీజ్‌ విభాగం ఏర్పాటు చేసినట్లు ఏవో డాక్టర్‌ నాగసతీశ్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్‌ పరమేశ్వర్‌ తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గ్యాస్ట్రో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. అత్యాధునిక ఎండోస్కోపీ పరికరాలతో జీర్ణ, ప్రేగు, లివర్‌ సంబంధిత రోగాలకు సమగ్ర చికిత్సలను అందించనున్నట్లు తెలిపారు.

ఇజ్రాయిల్‌లో జగిత్యాల వాసి మృతి

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవిగౌడ్‌ (45) ఇటీవల ఇజ్రాయిల్‌ దేశంలో గుండెపోటుతో మరణించా డు. మంగళవారం జగిత్యాల మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి రవిగౌడ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇజ్రాయిల్‌ దేశంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు జాప్యం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పిస్తామని హామీ ఇచ్చారు.

విద్యుత్‌షాక్‌తో యువకుడు..

జగిత్యాలక్రైం(సారంగాపూర్‌): సారంగాపూర్‌ మండలం పోతారంలో కొత్త ఇంట్లో వైరింగ్‌ చేస్తుండగా నా రపాక బల్తగిరి (25) విద్యుత్‌షాక్‌ తగిలి మృతిచెందా డు. బీర్‌పూర్‌ మండలం ఇందిరనగర్‌కు చెందిన నారపాక బల్తగిరి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సా రంగాపూర్‌ మండలం పోతారానికి చెందిన బై రి రమేశ్‌ ఇంట్లో విద్యుత్‌ వైరింగ్‌ చేస్తుండగా ప్ర మాదవశాత్తు షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సారంగాపూ ర్‌ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అల్ఫోర్స్‌ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్‌బుక్‌లో చో1
1/3

అల్ఫోర్స్‌ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్‌బుక్‌లో చో

అల్ఫోర్స్‌ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్‌బుక్‌లో చో2
2/3

అల్ఫోర్స్‌ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్‌బుక్‌లో చో

అల్ఫోర్స్‌ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్‌బుక్‌లో చో3
3/3

అల్ఫోర్స్‌ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్‌బుక్‌లో చో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement