
పోగొట్టుకున్న రూ.7లక్షల ఆభరణాలు అప్పగింత
గోదావరిఖనిటౌన్: ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన తోట లక్ష్మి ఈనెల 19న సుల్తానాబాద్ వద్ద గోదావరిఖని డిపో బస్సులో పోగట్టుకున్న 89 గ్రాముల బంగారు ఆభరణాలను స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం అప్పగించినట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. లక్ష్మి తన కుమారుడి వైద్యం కోసం నగలు తనఖా పెట్టడానికి సికింద్రాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తున్న ఇదే డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణం చేసిందని తెలిపారు. ఈక్రమంలో సుల్తానాబాద్ వద్ద రూ.7లక్షల విలువైన 89 గ్రాముల బంగారు ఆభరణాలు గల బ్యాగు పోగట్టుకుందన్నారు. గుర్తించిన కండక్టర్ కె.శ్రీనివాస్ నిజాయతీగా డిపోలో అందించారని వివరించారు. సమాచారం అందుకున్న లక్ష్మి కుటుంబసభ్యులు శుక్రవారం గోదావరిఖని డిపోకు చేరుకుని తనను సంప్రదించారన్నారు. ఆధారాలు చూపించగా... ఆభరణల బ్యాగు అందదించామని చెప్పారు. కండక్టర్ కె.శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.