
వినతిపత్రం అందిస్తున్న కార్మికులు
రామగిరి:హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులపై పనిభారం తగ్గించాలని ఆర్జీ–3 పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. 15 సంవత్సరాలుగా ఎస్టిమేట్ పెంచకుండా టెండర్లు పిలవడం ద్వారా కార్మికులపై పనిభారం పెరుగుతోందన్నారు. ఆఫీస్‌ల సంఖ్య పెంచడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల వెంకన్న, ఓదెమ్మ, రాధ, కనకలక్ష్మి, సరోజన పాల్గొన్నారు.
‘సీ విజిల్’కు 116 ఫిర్యాదులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ సీ –విజిల్ యాప్ ద్వారా 116 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్‌ఖాన్ తెలి పారు. 1950 టోల్‌ఫ్రీ ద్వారా 1,295 ఫిర్యాదులు అందాయన్నారు. ఇప్పటివరకు రూ.కోటి 49లక్షల16వేల860 సీజ్ చేయగా ఆధారాలు చూపడంతో రూ.కోటి 4లక్షల16వేల860 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. సరైన ఆధారాలను చూపకపోవడంతో రూ.45లక్షలను సీజ్‌చేసి ఉంచినట్లు వివరించారు.
వృద్ధుడి ఆత్మహత్య
సారంగాపూర్: మండల కేంద్రానికి చెందిన కస్తూరి రాయమల్లు (75) క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రా యమల్లు భార్య గంగమ్మ నాలుగు నెలల క్రితం మృతిచెందింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్నాడు. పైగా ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతుండడంతో శుక్రవారం రాత్రి ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గొల్లపల్లి: శ్రీరాములపల్లికి చెందిన చిల్ముల చిన్న గంగారాం (54) చికిత్స పొందుతూ మృతిచెందాడు. గంగారాం ఈనెల 7న ద్విచ క్ర వాహనంపై ఇంటికి వస్తుండగా గుర్తుతెలి యని వాహనం ఢీకొట్టడంతో తలకు, ఇతరచోట్ల బలమైన గాయాలయ్యాయి. జగిత్యాలలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదుచేసింది.
క్లుప్తంగా