సోమవారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 5 2026 12:39 AM | Updated on Oct 5 2026 12:39 AM

న్యూస్‌రీల్‌

కాలినడకన కూడా ప్రయాణించడానికి వీలు లేకుండా ఆధ్వానంగా మారిన ఆదివాసీ గిరిజన గ్రామ రోడ్లు దుస్థితిని మార్చి పల్లె బాట వేయండని తివ్వాకొండ పరిసర గిరిజనులు వేడుకుంటున్నారు. పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణను కలిసి విన్నవించుకున్నారు. కాలినడకకు కూడా వీలు లేని రాళ్లు తేలిన, బట్టీలుగా మారిన దారుల్లో అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్‌ రాలేక డోలీలే దిక్కుగా మారుతున్నాయని వాపోతున్నారు.

భామిని మండలం తివ్వాకొండ సమీపంలోని డోకులగూడ రోడ్డు కష్టాలు వర్ణనాతీతం. ఇసుకగూడ నుంచి కొండ పరిసరాల్లో గతంలో వేసిన రోడ్డు కొట్టుకు పోయింది. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం కాలినడకన బాలేరు వచ్చి రేషన్‌ పట్టుకు వెళ్తున్నారు. చదువులకు వెళ్లాల్సిన గిరిజన విద్యార్థులు నడవడానికి వీలుగా శ్రమదానం చేసి రోడ్డుపై రాళ్లు ఏరారు. ఇదే డోకులగూడ గిరిజనులు వాహనాలపై వెళ్లాలంటే రెండింతల దూరంలోని నడింగూడ, గేదెల గూడల మీదుగా మూలగూడ రోడ్డులో ప్రయాణించాల్సిందే.

భామిని మండల కేంద్రానికి దగ్గరలో గల కోటకొండ రోడ్డు కష్టాలు అన్నీఇన్నీ కావు. పలుమార్లు అత్యవసర పరిస్థితిలో డోలీలతో బాధితులను కిందికి దించారు. కడండసింగి మీదుగా కోటకొండకు వెళ్లాలంటే రోడ్డు లేదు. బండ్రసింగి–కోసింగిగూడల మీదుగా కొండలపై నుంచి నడిచి వెళ్లాల్సి వస్తోంది. కొండ వెంబడి తేలిన రాళ్లను తీసి రోడ్డు బాగు చేసినా వర్షాలు వెంటాడుతూ కాలువల్లా మారుతున్నాయి. వాహనాలతో వెళ్లాలంటే ఒడిశాలోని గుజ్జబాయి, మొనిఖ్ఖల్‌ రోడ్డులో వెళ్లాల్సిందే. అదేవిధంగా తాటిమానుగూడ, ఇప్పగూడమానుగూడలకు రోడ్డు రూపమే లేదు. ఏబీ రోడ్డు పక్కనే ఉన్నప్పటికీ పక్కారోడ్డుకు నోచుకోలేదు.

నిత్యం తప్పని డోలీ కష్టాలు

డోకులగూడలో నడవడానికి విద్యార్థుల శ్రమదానం

గిరిజన గ్రామాలకు రోడ్లు వేయండని ఆదివాసీల వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement