రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయం

Oct 5 2026 12:39 AM | Updated on Oct 5 2026 12:39 AM

● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

సాలూరు: రానున్న మున్సిపల్‌ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లోను వైఎస్సార్‌సీపీ గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని 11వ వార్డులో వైఎస్సార్‌సీపీ కమిటీ సభ్యులకు ఐడీ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలందరికి వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు పార్టీ ఈ టీడీపీ పార్టీ అని దుయ్యబట్టారు. ప్రతి మహిళకు జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌చేయూత పథకం కింద ఏడాదికి 18,500 ఇవ్వగా,ఈ చంద్రబాబు ప్రభుత్వం సూపర్‌సిక్స్‌లో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీని అమలుచేయకుండా మహిళలను మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మోసం చేశారని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ ఫెయిల్యూర్‌గా నిలి చిందని ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనను చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజలకు వివరించాలని కోరారు. అందరూ సమష్టిగా సమన్వయంతో వైఎస్సార్‌సీపీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాండ్రంకి అచ్చిబాబు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

12వ వార్డు కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ

సాలూరు రూరల్‌: మున్సిపాలిటీలోని 12వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, పార్టీలో వివిధ కమిటీలకు సంబంధించిన కార్యకర్తలకు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర ఆదివారం సాయంత్రం పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, కూటమి ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతే మన పార్టీకి బలమన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తొలి ప్రాధాన్యం ఇచ్చారని, అలాగే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేందుకు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement