పార్వతీపురం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్‌ఎస్)లో ప్రజలు తమ వినతులను సమర్పించవచ్చునని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ఆదివారం తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు, వాటి స్థితిని మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడంతోపాటు1100 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చునన్నారు. కలెక్టరేట్‌లో ప్రతీ రోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
’క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన ఇవ్వండి
పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను వెల్లడించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ప్రజలను కోరారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో ప్రజలకు స్పష్టంగా కన్పించేలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పౌరులు సేవలు పొందిన వెంటనే మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చునన్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంతో పాటు మండల కార్యాలయాల్లో కూడా పీజీఆర్‌ఎస్ అర్జీలు సమర్పించవచ్చునన్నారు.
6న తోటపల్లిలో వరుణయాగం
గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల్లో ఈనెల 6న ఉదయం 6.45 గంటలనుంచి వరుణ యాగం, వరుణ జపం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీవీ.సూర్యనారాయణ ఆదివారం తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్ర, దేశ ప్రజల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధికంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
బాడంగి: మండలంలోని గొల్లాదివద్ద పాల్తేరు చానల్ గట్టుకు గండిపడడంతో రైతులు 100ఇసుక బస్తాలతో గండికి అడ్డుకట్ట వేసి సాగునీరు వృథాగాపోకుండా పొలాలకు, చెరువులకు మళ్లించారు. తుఫాన్ వర్షాలకు చానల్‌కు భారీగా వరదరావడంతో గొల్లాదివద్ద గండిపడింది. తుఫాన్ అనంతరం భీమవరానికి చెంది న చానల్ నీటిసంఘం మాజీ టీసీ లచ్చుపతు ల తిరుపతి, పాల్తేరు గ్రామానికి చెందిన మరడగోపాలనాయుడు, గులిపిల్లి శంకర్, మరిపి పైడిరాజు గొల్లాదివద్దపడిన గండిని పరిశీలించారు. తొలుత ఇసుక బస్తాలతో తాత్కాలిక ఆడ్డుకట్టవేసి నీటిని వృథా కాకుండా చూడాల ని నిర్ణయించి ఆదివారం రైతులతో కలిసి ఎడ్లబండ్లపై ఇసుకబస్తాలు తెచ్చి గండికి అడ్డంగా వేసి తాత్కాలికంగా గండిని పూడ్చారు. దీంతో దిగువన గల గ్రామాలైన భీమవరం, పాల్తేరు అప్పలనాయుడు చెరువుకు సాగునీటిని రప్పించే మార్గం సుగమం చేశారు. గత ఐదేళ్లుగా అదేప్రాంతంలో గండి పడుతున్నా అధికారులు పక్కా చర్యలు చేపట్టకపోవడంతో రైతులే పూనుకుని ఇసుకబస్తాలతో గండిని తాత్కాలి కంగా పూడ్చి చానల్ ద్వారా రైతులకు సాగునీరందే చర్యలు చేపట్డాన్ని ఆయాగ్రామస్తులు అభినందించారు. ఇందుకు సామాజిక కార్యక ర్త వంగపండు రమేష్ కూడా సాయం అందించి శాశ్వతంగా సమస్య పరిష్కారంకావాలంటే సిమెంట్ కాంక్రీట్‌తో గోడను నిర్మించాలని ఆయన అధికారులను కోరారు.
విజయనగరం క్రైమ్: గురజాడ సాంస్కృతిక సమాఖ్య నూతన ప్రధాన కార్యదర్శిగా మామిడిపాక అని ల్‌కుమార్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఆది వారం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రధా న కార్యదర్శిగా సేవలందించిన కాపుగంటి ప్రకాష్ స్థానంలో అనిల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ది సన్ స్కూల్ అధినేతగా ఉన్న అనిల్‌కుమార్ గతంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. సమాఖ్య అధ్యక్షుడిగా డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, వ్యవస్థాపక అధ్యక్షుడిగా పీవీ నరసింహరాజు, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కాపుగంటి ప్రకాష్ కొనసాగనున్నారు. కోశాధికారిగా డాక్టర్ ఎ.గోపాలరా వు కొనసాగుతారు.


