ఆదివాసీల ఆవేదన..! | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల ఆవేదన..!

Oct 5 2026 12:39 AM | Updated on Oct 5 2026 12:39 AM

డోకులగూడ ప్రజల కష్టాలు చూడండి.. కోటకొండ దారి కష్టాలు తీర్చండి

డోకులగూడ రోడ్డు నడడానికి వీలు లేకుండా ఉంది. శ్రమపడి మా విద్యార్థులు చేపట్టిన శ్రమదానం వృథాగా మారింది. నెలవారీ రేషన్‌ తెచ్చుకోవడానికి 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్నాం. రోడ్డు సరిగ్గా లేక ఉన్నత చదువులు కొనసాగడం లేదు. రోడ్డు కష్టాలు తీర్చండి.

కొండగొర్రి ప్రసాద్‌, ఆదివాసీ గిరిజనుడు, డోకులగూడ, భామిని మండలం

తివ్వాకొండ వెంబడి కాలినడకకు కష్టంగా మారుతున్న కడంబసింగి–కోటకొండ రోడ్డు నిర్మాణానికి పలుమార్లు విన్నవించాం. ప్రభుత్వం ప్రకటించిన పల్లెబాటను వేయాలి. పలుమార్లు కాలినడక కోసం రాళ్లు ఏరి రోడ్డు నడవడానికి వీలుగా మార్చినా ఫలితం లేకపోతోంది. తక్షణమే రోడ్డు కష్టాలపై దృష్టి పెట్టండి.

..ఆరిక జమ్మయ్య, ఆదివాసీ గిరిజనుడు, బండ్రసింగి, భామిని మండలం

రోడ్డులోని రాళ్లు ఏరుతున్న కడంబసింగి గిరిజన యువకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement