● ఆసక్తిగా తిలకిస్తున్న గిరిజన గ్రామాల ప్రజలు
గిరిశిఖరాల నుంచి కిందికి పారుతున్న జలం
గిరిశిఖరాల నుంచి జాలువారుతున్న నీరు
కురుపాం: మండలంలోని తూర్పుముఠా ప్రాంతంలో అతి ఎత్తైన కొండల మీద ఉన్న జరడ పంచాయతీ జరడ గ్రామ పరిసరాల్లో ఉన్న జలపాతాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా గిరిశిఖరాల నుంచి జాలువారుతున్న జలపాతాలను చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలతో పాటు దూర ప్రాంతాల యువత జరడ జలపాతాలను చూసేందుకు వెళ్లి తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఎత్తైన కొండల మీద నుంచి జాలువారుతన్న నీటి కింద జలకాలాడుతూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. చాలా కనువిందుగా ఉందని జరడ జలపాతాలను చూసిన యువత చెబుతున్నారు.


