సబ్‌ కలెక్టర్‌ రహార్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

సబ్‌ కలెక్టర్‌ రహార్‌ బాధ్యతల స్వీకరణ

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

పార్వతీపురం: పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా సచిన్‌ అర్చిత్‌ రహార్‌ శనివారం బాధ్యతలు స్వీక రించారు. ఈ సందర్భంగా రెవె న్యూ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమావేశమై సబ్‌ డివిజన్‌లోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారం, పారదర్శక రెవెన్యూ సేవలు, ప్రజా ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా!

సాలూరు రూరల్‌: అభివృద్ధి, సంక్షేమం ఎవరి పాలనలో జరిగిందో... అలాగే అవినీతి, కుటుంబ పాలన ఎవరిదో ప్రజల సమక్షంలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. మంత్రి సంధ్యారాణి కూడా సిద్ధపడితే తేదీ, స్థలం చెబితే తాము అక్కడికే వస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సవాల్‌ విసిరారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో సంధ్యారాణి నియోజకవర్గంలో చేపట్టబోయే హామీలు గెలిచిన తరువాత విస్మరించారని ఆరోపించారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో... వైఎస్సార్‌సీపీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంధ్యారాణి నిర్ణయించుకొని చెబితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. సంధ్యారాణి పసలేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని దీన్ని ముందు గుర్తించాలని సూచించారు. మంత్రిగా సంధ్యారాణి హయాంలో... తన పదవీ కాలంలో నియోజకవర్గానికి ఎవరు ఏమి చేశారో ప్రజలకు తెలుసన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో వేసిన రోడ్లపైనే మంత్రి సంధ్యారాణి కాన్వాయ్‌ ఇప్పుడు పరుగులు తీస్తుందని గుర్తు చేశారు. మామిడిపల్లి – శంబర మీదుగా మక్కువ రోడ్డు ఎవరు వేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. మంత్రి సొంత గ్రామానికి వెళ్లాలంటేనే తన హయాంలో వేసిన రోడ్డుపై వెళ్లాలన్నారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన ఘనత ఎవరిదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement