నెల్లిమర్ల రూరల్:
మండలంలోని టెక్కలి గ్రామంలో ఉన్న సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో వికసిత్ భారత్ ఫార్మా క్లాన్‌కేవ్–2026 శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ ప్రశాంత్‌కుమార్ మహంతి విచ్చేసి ఫార్మా రంగ భవిష్యత్ అవకాశాలను వివరించారు. పలువురు నిపుణులు డిజిటల్ ఫార్మా, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వినియోగం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించడంతో పాటు నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చందన్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.


