సాలూరు రూరల్: పట్టణానికి చెందిన ఒక వ్యక్తి తన సొంత అవసరాల నిమిత్తం బ్యాంక్ లాకర్‌లో ఉన్న తన 900 గ్రాముల బంగారాన్ని శనివారం మధ్యాహ్నం తీసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పోగొట్టుకున్నాడు. మూడు గంటల వ్యవధిలోనే పోలీసులు బంగారు ఆభరణాల బ్యాగును కనిపెట్టి బాధితులకు ఎస్పీ వి.మాధవరెడ్డి చేతులు మీదుగా అప్పజెప్పారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బ్యాంక్ నుంచి బ్యాగులో ఆభరణాలు ద్విచక్ర వాహనానికి పక్కన వేలాడదీసి వెళ్తుండగా డబ్బీవీధి మర్గమధ్యలో హుక్కు నుంచి జారిపడినట్లు సాంకేతికతను ఉపయోగించి గుర్తించి ఆ ప్రాంతంలో ఒక మహిళను ప్రశ్నించారు. ఆ బ్యాగు తనకు దొరికిందని తెచ్చి ఇచ్చినట్టు తెలిపారు. సుమారు కోటి రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణా ల కేసును పోలీసులు త్వరగా చేధించడంతో ఎస్పీ మాధవరెండ్డి వారిని అభినందించారు. సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.


