●కష్టాన్ని నమ్ముకుని.. | - | Sakshi
Sakshi News home page

●కష్టాన్ని నమ్ముకుని..

Sep 12 2026 1:00 AM | Updated on Sep 12 2026 1:00 AM

●కష్టాన్ని నమ్ముకుని.. ●వేలాది రూపాయల మదుపు

కష్టాన్ని నమ్ముకుని సేద్యం చేస్తున్నాం. ఈ ఏడాది వరి రెండెకరాల్లో, కాయగూర పంటలు ఓ ఎకరాలో వేశాం. కీలక దశల్లో సాగునీరు లేక మోటార్లు, బోర్లుపై ఆధారపడ్డాం. అయినా నమ్మకం లేదు. ఇప్పటివరకూ దాదాపు రూ.60 వేల వరకూ పెట్టుబడులు పెట్టాం. కుటుంబమంతా కష్టపడుతున్నాం. ఈ వర్షాలు కంటితుడు పు మాత్రమే. పరిస్థితి ఇలానే కొనసాగితే అప్పులు చేసి పెట్టిన మదుపులు కూడా రావు. ఆశలన్నీ వరుణిడిపైనే పెట్టుకున్నాం.

–జి.లక్ష్మణరావు, రైతు, అంపిలి, పాలకొండ మండలం

కుటుంబ పోషణకు సేద్యాన్ని నమ్ముకున్నాం. మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ఇప్పటికే వేలాది రూపాయలు మదుపులు పెట్టాను. దుక్కులు చేసి నారుపోసి మూడు నెలలు గడుస్తోంది. సాగునీరు లేక సకాలంలో ఉడుపులు చేపట్టలేకపోయాను. వర్షపు నీటి ఆధారంగా ముదిరిన నారు వేశాం. భగవంతుడిదే భారం. తిండి గింజలైనా వస్తాయన్న ఆశతో ఉన్నాను. రానున్న రోజు ల్లో వానలు కురవకుంటే మట్టే మిగులుతుంది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. –ఎం.రమణమ్మ, కౌలురైతు, పెదపెంకి, బలిజిపేట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement