రెన్యువల్‌కే ఆసక్తి
గతంలో ‘సర్కారు’కే ఆదాయం
మళ్లీ పాతవారికే రెన్యువల్
ఉన్న మద్యం దుకాణాలనే పునరుద్ధరించాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, పార్వతీపురం మన్యం:
మద్యం ఏరులై పారించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పాలసీని తీసుకొచ్చిన విషయం విదితమే. గత వైఎస్సార్‌సీపీ సర్కారులోని ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి.. ప్రైవేట్ వ్యాపారాలకు కట్టబెట్టి, దొరికినంత దోచుకోండంటూ పచ్చ తివాచీ పరిచింది. 2024–26 కాలపరిమితితో జిల్లాలోని 56 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించారు. మద్యం షాపుల లీజు గడువు కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న వారికే మరికొన్నాళ్లు లైసెన్సు పునరుద్ధరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి నేడో, రేపో ఉత్తర్వులు రానున్నాయి. 2024–26 లైసెన్సు రుసుములే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలానికి లైసెన్సుల పునరుద్ధరణకు 38 శాతం ఫీజుగా ఉంటుందని సమాచారం. అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు నూతన విధానం అమల్లో ఉండే అవకాశం ఉంది.
దోచుకోవడానికే ‘పర్మిట్’
జిల్లాలోని 15 మండలాల్లో ఐదు ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 56 ప్రైవేట్ మద్యం దుకా ణాలు నడుస్తున్నాయి. ఒక్కో షాపులో రోజుకు బీరు, మద్యం సీసాలు కలిపి 700కుపైగా అమ్ముడవుతున్నాయి. ఇక.. బెల్టు దుకాణాల్లో అమ్మకాలు 24 గంటలూ సాగుతున్నాయి. నియంత్రణ లేక, ప్రతి గ్రామంలోనూ మద్యం ఏరులై పారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం సిండికేట్ వ్యాపారానికి పరోక్షంగా సహకారం అందిస్తోందన్న విమర్శలున్నాయి. నేరుగానే మద్యం దుకాణాల్లో సీసాపై రూ. 10 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులకు తెలిసినా.. చర్యలు ‘మామూలే’! ఈ నేపథ్యంలో మందబాబుల జేబు లకు చిల్లులు పడుతున్నాయి. సిండికేట్‌కు మేలు చేస్తూ విక్రయాలపై వ్యాపారులకు 10 శాతం ఉన్న మార్జిన్‌ను 15 శాతానికి ప్రభుత్వం పెంచింది. మరోవైపు మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ప్రతినెలా ఎకై ్సజ్ అధికారులకు లక్ష్యం విధిస్తోంది. దీంతో సిండికేట్ల ఇష్టారాజ్యంగా మారింది. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా ఎంఆర్పీ ధరకు మించి అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో బెల్టు దుకాణాలకు లెక్కే ఉండడం లేదు. చాలాచోట్ల వేళాపాళా లేకుండా అమ్మకాలు సాగిపోతున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబా బు.. చేతల్లోకి వచ్చేసరికి మందుబాబులకు చుక్క లు చూపిస్తున్నారు. రూ.99 చీప్ లిక్కర్ మినహా మిగిలిన బ్రాండ్లుపై రెండేళ్లలో బాటిల్ ఎంఆర్పీ ధరకు రూ.20లు అదనంగా పెంచారు. మద్యం సేవించే వారిలో అధిక శాతం మంది పేద, మధ్య తరగతి వర్గాల వారే. రూ.99 చీప్ లిక్కర్ బ్రాండ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా రూ.120ల ఓఏబీ. రూ.130ల మంజీర, రూ.150 క్లాసిక్ బ్లూ, ఏసీ బ్లాక్, పార్టీ స్పెషల్, సిల్వర్ బ్రాండ్లు, అలాగే మధ్యతరగతి వర్గాల వారు రూ.190ల ఎంసీ, ఐబీ, ఐకానిక్ వైట్, ఆఫ్టర్ డార్క్, రూ.190ల ఎంహెచ్ బ్రాందీ, రూ.230ల 8 పీఎం తదితర క్వార్టర్ బాటిల్స్ కొనుగోళ్లు చేస్తుంటారు. ప్రతి సీసా పైనా రెండేళ్లలో ప్రభుత్వం రూ.20 పెంచింది. మద్యం సిండికేట్లు రూ.10లు అదనంగా వసూలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో మరింత దోపిడీ సాగిపోతోంది. గతంతో పోలిస్తే ప్రభుత్వం, సిండికేట్ బాదుడుతో బాటిల్ ధర రూ.30లు అదనంగా పెరిగింది.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో ఇప్పటికే బాగానే ఆర్జించిన సిండికేట్ వర్గాలు గడువు ముగుస్తున్న తరుణంలో నష్టాల పేరిట మరింత దోపిడీకి తెర తీస్తున్నారన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. భారీగా లైసెన్స్ ఫీజులు చెల్లించామని, అమ్మకాలపై 20 శాతం మార్జిన్ ఇస్తామ ని చెప్పి ప్రభుత్వం కోత పెట్టడంతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు. లీజు గడువు పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ సిండికేట్ ప్రభుత్వ పెద్దలతో పైరవీలు చేసినట్టు తెలు స్తోంది. ఈ క్రమంలోనే పాతవారికే తిరిగి షాపు లు కట్ట బెట్టే పనిలో ప్రభుత్వం ఉంది. షాపులన్నింటినీ తిరిగి రెన్యువల్ చేయనున్నట్టు టీడీపీ శిక్షణ తరగతుల్లో చంద్రబాబు వెల్లడించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం షాపు లు ప్రభుత్వ అధీనంలో ఉండటంతో నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపు ల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాపులు ఉండేవికావు. మద్యం అమ్మకాలపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చేరి తిరిగి సంక్షేమం రూపంలో పేదలకు అందేది. కూటమి పాలనలో మద్యం ఆదాయం చాలా వరకు కూటమి నేతలు, సిండికేటు జేబుల్లోకి వెళ్లిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


