ప్రతిచోటా పోటీ చేద్దాం.. గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్రతిచోటా పోటీ చేద్దాం.. గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం

Sep 11 2026 10:51 AM | Updated on Sep 11 2026 10:51 AM

ప్రతిచోటా పోటీ చేద్దాం.. గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం

మన్యంలో వైఎస్సార్‌సీపీ జెండాను

ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇద్దాం

చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత

పాలనను ప్రజలకు వివరిద్దాం

రెండున్నరేళ్లుగా ఒక్క పింఛన్‌

మంజూరు చేయలేదు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ

దరఖాస్తుల స్వీకరణ నాటకం

సాలూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా పోటీచేద్దాం.. అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేద్దాం.. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులకు మా జీ డిప్యూటీ సీఎం, పార్టీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. సాలూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలందరికీ చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. టీడీపీ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధాలను, గత వైఎస్సార్‌సీపీ పాలనలో ని సంక్షేమ పాలనను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఆశావహులందరూ ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

నూతన పింఛన్‌ మంజూరు ఓ నాటకం

ప్రజలకు రెండున్నరేళ్లు సుదీర్ఘ నిరీక్షణ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభు త్వం చేపట్టిన పింఛన్ల మంజూరు అంశం ఓ బూ టకమని రాజన్నదొర విమర్శించారు. దరఖాస్తు చేసేందుకు వారం రోజులే గడువు ఇవ్వడం దారు ణమన్నారు. అర్హుల పింఛన్‌ దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారు..

రాజకీయాల్లో కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ప్రథమస్థానంలో నిలవగా, మంత్రి సంధ్యారాణి రెండో స్థానంలో ఉన్నారని రాజన్నదొర విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరుచేసి చేపట్టిన పనులను టీడీపీ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకంపై మంత్రి చేసిన తొలి సంతకం నేటికీ అమలుకాలేదని, మహిళల ఆత్మగౌరవం కాపాడతామని రెండున్నరేళ్లయినా పట్టణంలో సామాజిక మరుగు దొడ్ల నిర్మాణాలు చేపట్టలేదని, పట్టణంలో మెయిన్‌రోడ్డు నుంచి వేదసమాజం వరకు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి ఏడాదిదాటుతున్నా నేటికి పనులు జరగలేదని, ఇది మంత్రి పనితీరుకు నిదర్శమని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్‌ సీపీలో ఫుల్‌జోష్‌..

సమావేశానికి సాలూరు నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివచ్చారు. జై జగన్‌, జై రాజన్నదొర నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. పార్టీలోని వివిధ కమిటీల సభ్యులకు మండలాల వారీగా ఐడీ కార్డులను రాజన్నదొర అందజేశారు. టీడీపీ వెన్నుపోటు పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 12 నుంచి మండల స్థాయిలో, 25 నుంచి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టా లని రాజన్నదొర సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు మరిశర్ల బాపూ జీనాయుడు, మక్కువ జెడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసులనాయుడు, పార్టీ మండలాధ్యక్షులు మావుడి రంగునాయుడు, వంగపండు అప్పలనాయుడు, సువ్వాడ భరత్‌శ్రీనివాస్‌, గొట్టాపు ముత్యాలునాయుడు, రావిపల్లి రామారావు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, ఎంపీపీ బడ్నాన ప్రమీల, రెడ్డి సురేష్‌, దండి శ్రీనివాసరావు, వీరంనాయుడు, రెడ్డి సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement