ఆయిల్‌పామ్‌ సాగుపై రైతుల ఆసక్తి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగుపై రైతుల ఆసక్తి

Sep 11 2026 10:51 AM | Updated on Sep 11 2026 10:51 AM

ఆయిల్‌పామ్‌ సాగుపై రైతుల ఆసక్తి

వరికి ప్రత్యామ్నాయంగా సాగు

ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం

25 ఏళ్ల పాటు నిత్యం రాబడి

గరుగుబిల్లి: వర్షాభావ పరిస్థితులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి వరి సాగు రైతులను కష్టాలు చుట్టుముడుతున్నాయి. పెట్టుబడి కూ డా రావడం లేదు. అప్పుల్లో కూరు కుపోతున్నారు. దీని నుంచి బయట పడేందుకు అధిక మంది రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మొక్కలను ఉద్యానవనశాఖ, ఆయిల్‌ పరిశ్రమలు రాయి తీపై అందజేస్తుండడం రైతులకు ఊరటనిస్తోంది.

4,500 ఎకరాల్లో సాగు

పార్వతీపురం డివిజన్‌ పరిధిలో గరుగుబిల్లి, సీతాన గరం, పార్వతీపురం, కురుపాం, కొమరాడ, గుమ్మలక్మీపురం మండలాల్లో 4,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగులో ఉంది. వరి పంటకు ప్రత్యామ్నాయంగా మరో 1,200 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో వంటి విపత్తుల నుంచి బయటపడవచ్చని భావిస్తున్నారు. మొక్క నాటిన నాలుగో ఏడాది నుంచి 25 ఏళ్ల వర కు దిగుబడి వస్తుంది. మొక్కతోట నుంచి ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి రాగా, ఏడో ఏడాది నుంచి ఎకరాకు పది టన్నుల దిగుబడి వస్తుందని అధి కారులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ దిగుబడులు మరింత పేరిగే అవకాశం ఉంటుంది. ఖరీఫ్‌లో జూన్‌ నెల నుంచి గెలల దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ఆయిల్‌ రికవరీని బట్టి గెలల ధరను నిర్ణ యిస్తుంది. ప్రతీనెలా 10వ తేదీ దాటిన తర్వాత ధర నిర్ణయం జరుగుతుంది.

రైతులకు ఉచితంగా మెక్కలు

ఆయిల్‌పామ్‌ సాగుచేసే రైతులకు హెక్టారుకు రూ.29వేల విలువైన 240 మొక్క లు ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరాకు 50 నుంచి 57 మొక్కలు వేయాల్సి ఉంది. హెక్టారుకు ఏడాదికి రూ.10,500 చొప్పున వరుసగా నాలుగేళ్లు రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement