మర్యాదపూర్వక కలయిక | - | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వక కలయిక

Sep 11 2026 10:51 AM | Updated on Sep 11 2026 10:51 AM

మర్యాదపూర్వక కలయిక

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. – గుమ్మలక్ష్మీపురం

రెడ్‌క్రాస్‌లో పోస్టులకు

22న ఇంటర్వ్యూలు

విజయనగరం ఫోర్ట్‌: రెడ్‌క్రాస్‌ సొసైటీలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 22న రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సత్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్‌ సూపర్‌ వైజర్‌ (బీఎస్సీ ఎంఎల్‌టీ), డీఎంఎల్‌టీగా ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ (డీఎంఎల్‌టీ విద్యార్హత) ఒక సంవత్సరం అనుభవం, స్టాఫ్‌నర్సు జీఎన్‌ఎం ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు.

విమానాశ్రయ భూముల పరిశీలన

బాడంగి: బాడంగి సమీపంలోని విమానాశ్రయ భూములను విశాఖ ఏన్‌డీఏకు చెందిన అధికారులు బొబ్బిలి ఆర్డీఓ రామమోహన్‌రావు, తహసీల్దార్‌ వరప్రసాద్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఎన్‌డీఏకు చెందిన డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థాయి అధికారులు విమానాశ్రయ గచ్చు రోడ్డుకు చేరుకొని కారుపై నలుమూలల తిరిగి నిశితంగా పరిశీలించారు. విమానాశ్రయానికి చెందిన రన్‌వేతో కలిపి సుమారు 247 ఎకరాల భూములకు కేవలం రన్‌వేగచ్చు రోడ్డు 50 ఎకరాలు మినహా మిగిలిన 197ఎకరాలు రైతుల ఆక్రమణలో ఉన్నట్టు నిర్ధారణకొచ్చారు. ఆక్రమిత భూముల్లో ప్రస్తుతం నీలగిరి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతుండడాన్ని గమనించారు. భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని రెవెన్యూ ఽఅధికారులను కోరారు. విమానాశ్రయ భూములను త్వరలో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement