స్పీడ్‌ మ్యాథ్స్‌లో కియాన్ష్‌ జాతీయ స్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

స్పీడ్‌ మ్యాథ్స్‌లో కియాన్ష్‌ జాతీయ స్థాయి గుర్తింపు

Sep 9 2026 12:47 AM | Updated on Sep 9 2026 12:47 AM

బొబ్బిలి: మలేసియాకు చెందిన యూసిమాస్‌(యుసీఎంఏఎస్‌) అనే అంతర్జాతీయ స్పీడ్‌ మ్యాథ్స్‌ ఆర్గనైజేషన్‌ ముంబయిలో నిర్వహించిన స్పీడ్‌ మ్యాథ్స్‌ పోటీల్లో బొబ్బిలికి చెందిన జాగరపు కియాన్ష్‌ మూడో స్థానం(సెకండ్‌ రన్నరప్‌) పొందాడు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పాల్గొన్న పరీక్షలో కియాన్ష్‌ ఈ స్థానం పొందాడు. ముంబయిలో ఈ నెల 5న పరీక్ష నిర్వహించారు. పోటీలో పాల్గొనేందుకు రాష్ట్ర స్థాయి పరీక్ష గత నెల 2న గుంటూరులో నిర్వహించగా అందులో ప్రధమ స్థానం సాధించాడు కీయాన్ష్‌. కేవలం 8 నిమిషాల వ్యవధిలో 200 లెక్కలను చేయాల్సి ఉండగా అన్ని లెక్కలూ పూర్తి చేసినట్టు తల్లిదండ్రులు డాక్టర్‌ రమేష్‌, బేబీ ప్రత్యూష తెలిపారు. మొత్తంగా 2వేల మార్కులకుగాను రెండు వేల మార్కులను కేవలం మైండ్‌ కాలిక్యులేషన్‌తో సాధించినప్పటికీ వయసు రీత్యా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కియాన్ష్‌ స్థానిక శ్రీనిధి డీజీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతుండగా తండ్రి జిల్లా కేంద్రంలో న్యూరో డాక్టర్‌గా సేవలందిస్తుండగా తల్లి ప్రత్యూష సాఫ్ట్‌వేర్‌. కీయాన్ష్‌ సాధించిన ఈ ప్రతిభకు పట్టణ వాసులు, విద్యావేత్తలు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement