‘అక్షరాలా అమరజీవి’ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘అక్షరాలా అమరజీవి’ పుస్తకావిష్కరణ

Sep 9 2026 12:47 AM | Updated on Sep 9 2026 12:47 AM

విజయనగరం: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సమగ్ర జీవిత చరిత్రపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట పురస్కార సేవాగ్రహీత సముద్రాల గురుప్రసాద్‌ రాసిన అక్షరాలా అమరజీవి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు భారతదేశ చిత్రపటాన్ని పునర్‌లిఖింపజేసిన మహనీయుడన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలుగు తేజం పొట్టి శ్రీరాములు జీవనయానం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు తవ్వా మోహనరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు బోండా రమేష్‌, కార్యదర్శి బాలకృష్ణ, పట్టణ శాఖ అధ్యక్షుడు గాయత్రీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement