● శుభాకాంక్షలు తెలియజేసిన జెడ్పీ అధికారులు, ప్రజాప్రతినిధులు
విజయనగరం రూరల్:
జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌కు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అలజంగి జోగారావు, శోభా హైమావతి, రాజాం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ తలే రాజేష్, అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ప్రసాదరావు, రాజాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇతర నియోజకవర్గ నాయకులు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


