న్యూస్‌రీల్
అడవి తల్లి విగ్రహం వద్దకు రాని ప్రజా ప్రతినిధులు
గిరిజనుల ఆశలకు దూరంగా గిరిజన మంత్రి
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఉత్సవం నీరు గారింది..
సాక్షి, పార్వతీపురం మన్యం:
కట్టూబొట్టు.. వేషభాషలో గిరిజనాన్ని
అనుకరించారు. మాటలో ఆదివాసీల పట్ల మమకారం కురిపించారు. అంతా ‘షో’ వరకే... గిరిజనుల సమస్యలపై మన్యం బంద్ ఒక వైపు జరుగుతుండగానే.. మరోవైపు ఆదివాసీ దినోత్సవాన్ని ఒక రోజు ముందుగానే, పార్వతీపురంలో శనివారం నిర్వహించారు. గిరిజన సంఘాలను ముక్కలుగా విడగొట్టి, చేపట్టిన ఉత్సవం ఆదివాసీలకు కాకుండా.. ప్రజా ప్రతినిధులు, అధికారులకే పండగలా మారింది.
గిరిజన మంత్రి ఉన్నచోటే గిరిజనులకు
అవమానం
ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన ఆదివాసీ దినోత్సవ సభకు గిరిజనులకు అడుగడుగునా అవమానమే జరిగింది. కనీసం ఆదివాసీల పండగ పేరిట నిర్వహించిన ఉత్సవంలోనూ గిరిజనేతరులకే ప్రాధాన్యం ఇచ్చారు. వేదిక ముందు గానీ.. సభ ముందు వరుసలో గానీ దాదాపు ఆదివాసీలు కూర్చోలేదు. ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, అధికారులతోనే కుర్చీలన్నీ నింపేశారు. వేదికకు దూరంగా, చిట్టచివరనే గిరిజనులు ఆసీనులయ్యారు. అప్పటి వరకూ నృత్యాలు చేసిన గిరిజన విద్యార్థులు సైతం కుర్చీలు లేక, దూరంగా నిల్చున్నారు. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం. సభ అంతా పూర్తయ్యేసరికి దాదాపు మధ్యాహ్నం 2 గంటలు దాటిపోయింది. అప్పటి వరకూ ఏ ఒక్కరికీ భోజనాలు లేవు. కనీసం తాగునీరు ఇచ్చే దిక్కు లేదు. పిల్లలు, పెద్దలు అంతా ఆకలితో అలమటించి పోయారు. దాదాపు 2.30 సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం ముగియడంతో ఒక్కసారిగా అంతా భోజనాల వద్దకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు నియత్రించాల్సి వచ్చింది. చాలామందికి అక్కడ అందించిన ఆహారం సరిపోలేదు. మళ్లీ వరుసలోకి వెళ్దాం అనుకున్నా, అప్పటికే పెద్ద ఎత్తున భోజనాల కోసం గుమిగూడి ఉండటంతో చాలామంది అర్ధాకలితోనే వెళ్లిపోయారు.
పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉన్న అడవి తల్లి విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పూజలు చేయడం, సారె సమర్పించడం ఆనవాయితీ. కలెక్టర్, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు మాత్రమే కొన్ని గిరిజన సంఘాలను తీసుకుని ర్యాలీగా అడవి తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ర్యాలీలోనూ గిరిజనులు కనిపించలేదు. కేవలం గిరిజన విద్యార్థులతోనే వెళ్లారు. అక్కడ వనమాత విగ్రహానికి పూజలు జరిపి, పాలాభిషేకం చేసి, సారె సమర్పించారు. జిల్లాలో ముగ్గురు ఎస్టీ శాసన సభ్యులు.. అందునా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నప్పటికీ, ఏ ఒక్కరూ రాలేదు. గిరిజన సంఘాలు చీలిపోయి, కొన్ని దూరంగా ఉన్నాయి.
పేరుకే ఉత్సవం.. పండగ అంతా అధికారులు, ప్రజా ప్రతినిధులదే
సభలో చిట్టచివరన ఆదివాసీలు
ఆకలితో అలమటించిన గిరిజన విద్యార్థులు, మహిళలు
గిరిజనులంతా ఒక వైపు.. గిరిజన శాఖ మంత్రి మరోవైపు
ఓవైపు జీఓ నంబర్ 3, ఇతర ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. గిరిజనులంతా ఒక వైపు పోరాడుతుండగా, ఆ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి.. వారిని విబేధిస్తూ, బంద్ రోజునే ఉత్సవాలు నిర్వహించారు. ఇదే సమయంలో మంత్రి సంధ్యారాణితో పాటు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు.. గిరిజనుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించడం కంటే.. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీని, ఆ పార్టీ అధినేతను తిట్టడానికే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. డీఎస్సీపై సవాళ్లు చేయడం.. ప్రతిపక్ష పోరాటాన్ని చిన్నది చేస్తూ దూషించడంతో.. అసలు వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, గిరిజనులు తెల్ల ముఖాలు వేశారు.


