వంగర: మండల పరిధి ఎం.సీతారాంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన శివ్వాల నిఖిల అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్ ద్వారా ప్రదర్శించిన ‘ఆటోమేటిక్ వ్యవసాయ క్షేత్ర పర్యవేక్షణ వ్యవస్థ’ అనే ప్రాజెక్టును జిల్లా స్థాయిలో ప్రదర్శించి ప్రతిభ కనబరచడంతో ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. ఇన్‌స్పైర్ మనక్ పోటీలకు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హెచ్‌ఎం కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు నిఖిలను అభినందించారు.
అందుబాటులోకి కల్చర్ పరీక్షలు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్ పరీక్షలు నిలిచిపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్న అంశంపై సాక్షిలో ఈ నెల 13న ‘సర్వజన ఆస్పత్రిలో నిలిచిన కల్చర్ పరీక్షలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం నుంచి కల్చర్ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు.
గంజాయితో ఇద్దరి అరెస్టు
విజయనగరం క్రైమ్: రూరల్ పోలీస్‌స్టేషన్ పరి ధి కోరాడపేట వద్ద గంజాయి రవాణ చేస్తున్న ఇద్దరిని శనివారం అరెస్టు చేశామని విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ అశోక్ తెలిపారు. అరకుకు చెందిన పాంగి పీతూరు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన కర్నేటి విజయ 11 కేజీల గంజాయితో కోరాడపేట వద్ద ఉన్నట్టు అందిన సమాచారంతో తనిఖీలు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి సుమారు 22 వేల రూపాయల విలువ గల 11 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
బొబ్బిలి: మద్యం సీసాలు తరలిస్తున్న రామభ్రపురం మండలం అప్పలరాజుపేట గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం తరలించినట్టు ఎకై ్సజ్ శాఖ బొబ్బిలి సీఐ పి.చిన్నంనాయుడు తెలిపారు. బొబ్బిలి పట్టణంలోని మద్యం షాపుల నుంచి ఏడు మద్యం సీసాలతో తమ గ్రామానికి వెళ్తుండగా పారాది గ్రామం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. అనధికారికంగా మద్యం సీసాలను తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.


