కుక్కేసి.. నోరు నొక్కేసి! | - | Sakshi
Sakshi News home page

కుక్కేసి.. నోరు నొక్కేసి!

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

కుక్కేసి.. నోరు నొక్కేసి! ● ఆగని పశువుల అక్రమ రవాణా ● ఉమ్మడి జిల్లా మీదుగా వేల సంఖ్యలో తరలింపు ● ఇతర రాష్ట్రాల్లోని వధశాలలకు మూగజీవాలు ● కనికరం, జాలి మరిచిన మాఫియా ముడుపులు ఉంటే.. అనుమతులు అక్కర్లే!

దాడులు అంతంత మాత్రమే..

● ఆగని పశువుల అక్రమ రవాణా ● ఉమ్మడి జిల్లా మీదుగా వేల సంఖ్యలో తరలింపు ● ఇతర రాష్ట్రాల్లోని వధశాలలకు మూగజీవాలు

ఇటీవల రాత్రి సమయంలో పార్వతీపురం మీదుగా పశువులను వాహనాల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనాలు ఒక ప్రజా ప్రతినిధికి చెందినవిగా తెలిసింది. వాటిని విడిచిపెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినట్లు సమాచారం.

గతంలో ఒడిశా రాష్ట్రం సిమిలిగుడ నుంచి భారీ వాహనాల

ద్వారా సాలూరు మీదుగా

86 పశువులను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు.

వాహనాన్ని సీజ్‌ చేశారు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

మ్మడి జిల్లా మీదుగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. విజయనగరం జిల్లాలో పెదమానాపురం సంత ఉత్తరాంధ్రలో పశువుల వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచే ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్నాయి. ఇందులో అధికశాతం వధశాలలకే కావడం గమనార్హం. ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా స్థాయి పశుసంవర్థక శాఖ అధికారి ఈ అక్రమ దందాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు విజిలెన్స్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ భాగం కేరళలోని గోవధ శాలలకు తరలిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఉమ్మడి జిల్లా మీదుగా వేలాది పశువులు కబేళాలకు అక్రమంగా తరలిపోతున్నాయి. కనికరం, జాలి మరిచి.. అతి కర్కశంగా పశువులను లారీల్లో కుక్కి బలవంతంగా ఎగుమతి చేస్తున్నారు. దీని వెనుక బలమైన రాజకీయ మాఫి యా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దందాలో లక్షలాది రూపాయ లు చేతులు మారుతున్నాయి. అధికారులు, నాయకులకు ముడుపులు అందుతున్నాయ నే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని పార్వతీపురం, నవగాం, సీతంపేట, అడ్డాపుశీల, పరశురాంపురం, గుమడ, పెదమానాపురం, సాలూరు, పాచిపెంట, అలమండ, రాజాం, కందివలస ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాలకు నిత్యం పశువుల తరలింపు అవుతోంది. సంతల్లో వ్యాపారులు రైతుల నుంచి పశువులను కొనుగోలు చేస్తున్నారు. వాటిని జాతీయ రహదారి సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో ఒక దగ్గరకు చేర్చి రాత్రిపూట లారీ లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు. కంటైనర్లలోనూ రహస్యంగా కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లోనే ఒడిశా నుంచి వందల కిలోమీటర్ల మేర పశువుల ను నడిపించి సంతలకు తరలి స్తున్నారు. ఈ తరలించే క్రమంలో వాహనాల్లో పశువులను పరిమితికి మించి ఎక్కిస్తుండటం వల్ల కొన్ని గోవులు మృత్యువాత పడుతున్నాయి. అలసిపోయి కదల్లేని స్థితిలో వాటిని హింసిస్తూ అత్యంత క్రూరంగా తరలిస్తున్నారు. పశువు ఆరోగ్యంగా ఉంటే రూ.20 వేలు, బక్క చిక్కితే రూ.10 వేలలోపు రైతులకు చెల్లిస్తున్నారు.

పశువుల తరలింపు, రవాణాకు అనుమతి పత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పను ల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. జిల్లాలో ఇవేవీ పాటించిన దాఖాలాలు లేవు.

పశువుల అక్రమ రవాణాపై దాడులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పార్వతీపురం జిల్లా కేంద్రం, విజయనగరంలోని పెద మానాపురంలో నిర్వహించే సంతల్లో దళారులు అధిక సంఖ్యలో పశువులను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారుల ఏజెంట్లకు విక్రయిస్తుంటారు. సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఒడిశా రాయగడ సమీపంలో పశువులను కొనుగోలు చేసి కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల మీదుగా ఆంధ్ర ప్రాంతానికి తీసుకువచ్చి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీలకు చెందిన కీలక నాయకుల అండదండలు పశువుల ఎగుమతి వ్యాపారం చేసే వారికి ఉండటంతో యథేచ్ఛగా ఈ దందా సాగుతోంది. అధికార పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు జిల్లా అధికారులకు ప్రతి వారం రూ.లక్షల్లో ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గురువారం పార్వతీపురంలో నిర్వహించే సంత, శనివారం మానాపురంలో సంతలకు పెద్ద ఎత్తున పశువుల రవాణా సాగుతోంది. ఒడిశాలోని నారాయణపట్నం, అలమండ, కొరాపుట్‌, పొట్టంగి, సిమిలిగుడ, నవ రంగ్‌ పూర్‌, జయపూర్‌, గుణుపూర్‌ నుంచి ఈ వారపు సంతలకు పశువులను తరలిస్తున్నారు. ఒడిశాలోని పొట్టంగి, సిమిలిగుడ, కొరాపుట్‌ ప్రాంతాల నుంచి వందలాది పశువులను కాలినడకన మానాపురం సంతకు తరలిస్తున్నారు. రవాణా చేస్తున్న వాహనాల కాంట్రాక్టు వెనుక అధికారపార్టీకి చెందిన ఓ ఉత్తరాంధ్ర మంత్రి సమీప బంధువు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసు, రవాణా, పశుసంవర్ధక శాఖ అధికారులు నోరు మెదపడం లేదనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement