ఆర్డీవో బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఆర్డీవో బాధ్యతల స్వీకరణ

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

ఆర్డీవో బాధ్యతల స్వీకరణ గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు, భద్రత ● ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లతో ఐటీడీఏ పీవో సమీక్ష

పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో)గా కె.మాధురి బుధవా రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆమెను కార్యాల యం సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమెకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నేపథ్యం లేనప్పటికీ, తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షలో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. మొదటి పోస్టింగ్‌లో ఎన్టీఆర్‌ జిల్లా తి రువూరు ఆర్డీవోగా విధులు నిర్వహించిన ఆమె పార్వతీపురం ఆర్డీవోగా బదిలీ అయ్యారు.

పార్వతీపురం రూరల్‌: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులతో పాటు పకడ్బందీ భద్రత కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం స్థానిక ’గిరిమిత్ర’ భవనంలో హెచ్‌ఎంలు, వార్డెన్లతో 2026–27 విద్యా సంవత్సర నిర్వహణపై ఆయన సమీక్షించారు. విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, కిట్లను సకాలంలో అందించాలని పీవో స్పష్టం చేశా రు. అకడమిక్‌ క్యాలెండర్‌ను తు.చ తప్పకుండా అమలు చేయాలని, సులభమైన అభ్యాస పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సురక్షిత తాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్లను నిరంతరం పర్యవేక్షించాలని, కిచెన్‌ గార్డెన్స్‌ పెంచి తాజా కూరగాయలను భోజనంలో వినియోగించాలని చెప్పారు. బాలికల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని, ’మంచి స్పర్శ–చెడు స్పర్శ’పై వారికి ప్రత్యేక అవగాహన కల్పించా లని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రగతిని వివరించేందుకు ప్రతి నెలా విధిగా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ డీడీ ఎ.విజయశాంతి, డిప్యూటీ డీఈవో క్షేమాభాయ్‌, ఐటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సీఏఎస్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు

విజయనగరం ఫోర్ట్‌: డైరెక్టర్‌ సెకండరీ హెల్త్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌ల్లో ఖాళీగా ఉన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌, స్పెషలిస్టు) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టులకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లోని సమావేశ మందిరంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ పద్మశ్రీరాణి అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేశారు. జనరల్‌ సర్జరీ ఒక పోస్టుకు ఆరుగురు, సీఎస్‌ జనరల్‌ నాలుగు పోస్టులకు 29 మంది అభ్యర్థు లు హాజరయ్యారు. పెథాలజీ–1పోస్టు, ఈఎన్‌టీ–1, రేడియాలజీ–3, ఆప్తమాలజీ–1 పోస్టుకు అభ్యర్థులు ఎవరూ హాజరుకాలేదు.

ఆవిష్కరణ

చిత్రంలో కూలింగ్‌ క్యాప్‌ను చూపిస్తున్నది గరివిడి కేజీబీవీ బాలికలు. 2024 సంవత్సరం నుంచి పాఠశాలలో చెప్పిన ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) తరగతుల్లో నేర్చుకున్న అంశాలతో కూలింగ్‌ క్యాప్‌ల తయారీ ప్రాజెక్టును రూపొందించారు. రెండు బ్యాటరీలను క్యాప్‌ లో అమర్చారు. ఒకసారి చార్జ్‌ చేస్తే 8 గంటలు పనిచేస్తాయి. ఈ క్యాప్‌లు తలకు పెట్టుకుంటే శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి, ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని బాలికలు చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు ఇవి ఎంతగానో ఉపయోగపతాయన్నారు. ప్రాజెక్టును గత నెల 24, 25, 26 తేదీల్లో గీతం యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనల్లో ప్రదర్శించారు. ఇది న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement