పార్వతీపురం: జిల్లాలోని పురపాలక సంఘాలకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించా రు. ఈ మేరకు బుధవా రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛత కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, బల్క్ వేస్ట్ జనరేటర్ల రిజిస్ట్రేషన్ పురోగతిని సమీక్షించారు. పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్ల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టిసారించి, నాలుగు వారాల సమగ్ర నివేదికను శుక్రవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఆదేశించారు. బల్క్‌వేస్ట్ జనరేటర్ల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించా రు. విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో మూడు మున్సిపాల్టీల కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలి
జిల్లాలో వరి పంటకు బదులుగా రాగి, జొన్నలు, మొక్కజొన్న, కంది, పత్తి వంటి అధిక ఆదాయం ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం 50శాతం మేర తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించా రు. అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథ కం లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నా రు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకరరావు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి జి. సత్యనారాయణరెడ్డి, జిల్లా పశుసంవర్థక శాఖాధికా రి సీహెచ్.దీనమయ్య తదితరులు పాల్గొన్నారు.
జలవనరుల పునరుద్ధరణకు ప్రాధాన్యం
జిల్లాలో ప్రతి నీటి చుక్కను సంరక్షించాల్సిన అవస రం ఉందని, జలవనరుల పునరుద్ధరణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. జలధార–జలహారతి పనుల్లో జిల్లా 94 శాతం ప్రగతితో ముందజలో ఉందని, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 9,374 పనుల్లో 8,687 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని, 3,268 పనులు పూర్తయ్యాయన్నారు. కురుపాం, భామిని, సాలూరు మండలాలు శతశా తం గ్రౌండింగ్ పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాయని పేర్కొన్నారు. ఇంకా ప్రారంభించాల్సిన 547 పనులను త్వరితగతిన చేపట్టాలని, ముఖ్యంగా సీతంపే ట, వీరఘట్టం మండలాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


