రాజాం మండలంలోని బొద్దాం జెడ్పీ హైస్కూల్‌లో కొత్తగా చేరిన విద్యార్థులకు అక్కడి పాఠశాల హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది వినూత్నంగా
ఆహ్వానం పలికారు. పాఠశాలలో 85 మంది విద్యార్థులు కొత్తగా చేరగా, వీరంతా బుధవారం తరగతులకు హాజరయ్యారు. పాఠశాల మెయిన్ గేటు వద్ద ఉపాధ్యాయులు ఇరువైపులా నిల్చొని విద్యార్థులపై పూలు జల్లి, డప్పువాయిద్యాలతో ఆహ్వానం పలికారు. వివిధ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు నుంచి పాఠశాలలో చేరినట్టు ఉపాధ్యాయులు తెలిపారు. అందరికీ ప్రమాణాలతో కూడిన విద్యను
బోధిస్తామని చెప్పారు. – రాజాం


