లారీ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

విజయనగరం క్రైమ్‌: విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి బడుకొండపేటకు చెందిన సత్యం(65) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య తవుడమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అశోక్‌ బుధవారం తెలిపారు. ఉదయాన్నే రోడ్డుపై వెళ్తున్న సత్యాన్ని లారీ ఢీ కొట్టడంతో పడిపోయాడని చికిత్స కోసం హాస్పిటల్‌ తరలించే లోగానే మృతిచెందాడని ఆయన భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

నిరుపేద విద్యార్థికి చేయూత

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని అప్పయ్యపేట గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి సతీష్‌కుమార్‌కు తమన్నా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పుస్తకాలు, యూనిఫాంతో పాటు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా పౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డేపల్లి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి విద్యాభ్యాసానికి దీర్ఘకాలికంగా అండగా నిలుస్తామన్నారు. విద్యార్థికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు, యూనిఫాంతో పాటు విద్యా సంవత్సరానికి అవసరమైన ఇతర విద్యా సామిగ్రిని అందజేసినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement