ఇదేం చోద్యం..! | - | Sakshi
Sakshi News home page

ఇదేం చోద్యం..!

Jun 15 2026 12:47 AM | Updated on Jun 15 2026 12:47 AM

చిరుద్యోగులతో టీడీపీ మండల నాయకుడి సమీక్ష

మేం చెప్పిట్లు వినాలంటూ ఆదేశాలు

సాలూరు రూరల్‌: మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, సచివాలయ సిబ్బందితో మంత్రి సంధ్యారాణి ఇంటి పక్కన గల ఇంటిలో టీడీపీ మండల నాయకుడు అనధికారికంగా ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ అధికారి కానీ, ప్రజా ప్రతినిధికానీ లేకుండానే సమీక్ష నిర్వహించడంపై సమీక్షకు హాజరైన సిబ్బందితో పాటు పలువురు ఇదేం చోద్యమంటూ ముక్కున వేలేసుకున్నారు. మంత్రి పిలిచారని చెప్పడంతో సమావేశానికి వచ్చామని తీరా మంత్రి సమావేశంలో లేకపోవడంతో మండల నాయకుడు సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకుని సమావేశానికి వచ్చిన వారమంతా అవాక్కయ్యామని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు లేకుండానే ఆదివారం పూట అనధికారికంగా సమీక్ష నిర్వహిస్తే మరి అధికారులు ఏంచేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో ఉద్యోగులను బెదిరించి పార్టీపై పట్టు సాధించాలన్న ఆలోచనతో ఇలా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చెలాయించే విధంగా ముందుకు వెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సమీక్షలో మండలంలో సంక్షేమ పథకాలు, ఓటర్ల జాబితా తదితర అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకుని గిరిశిఖర గ్రామాలపై పట్టు సాధించడం కోసం ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇలా పార్టీ నాయకులు నిర్వహిస్తున్న అనదికార సమీక్షసమావేశాలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి పేరు చెప్పి ఇలా ప్రభుత్వ చిరుద్యోగులపై పెత్తనం చెలాయించి ఆదివారం పూట మండుటు ఎండలో చిన్నపిల్లలతో వచ్చిన పలువురు ఆశవర్కర్లు, అంగనవాడీలు ఇబ్బందులకు గురైనట్లు చెబుతున్నారు.

కార్యకర్తలే మంత్రి శాఖలు నడుపుతారా?

గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి శాఖలు కార్యకర్తలే నడుపుతారా? అనధికారికంగా ఆదివారం పూట మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, ిసచివాలయ ఉంద్యోగులతో సహెచ్‌డబ్ల్యూఓలతో ఒక పార్టీ మండల నాయకుడు ఆముదాల పరమేషు ఏ హోదాలో సమీక్ష సమావేశం నిర్వహించారని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రశ్నించారు. గతంలో కూడా పట్టణంలోని డబ్బివీధిలో ఒక గదిలో ఇదే సిబ్బందితో సమీక్ష నిర్వహించారని ఆరోపించారు.

అధికారులు అవసరమా?

ప్రభుత్వ ఉద్యోగులతో తెలుగుదేశం కార్యకర్తలే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే అధికారులు ఎందుకు? మహిళా సీ్త్ర సంక్షేమ శాఖకు పీడీ అవసరమా? కలెక్టర్‌, జేసీలు అవసరమా? అని రాజన్నదొర ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలే సమీక్షలు నిర్వహిస్తుంటే ప్రజాప్రతినిధులు ఎందుకని సందేహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీపీ, ప్రజా ప్రతినిధి హోదాలో సమీక్ష నిర్వహిస్తే సరే కానీ ఏ పదవీ లేకుండా అంగన్‌వాడీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించడమంటే ఆ శాఖ అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్‌ దర్యాప్తుచేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా గుడ్లు పాలు ఇవ్యడం లేదని పత్రికల్లో వార్తలు వచ్చినా ఇంతవరకు ఏంచర్యలు తీసుకున్నారో కలెక్టర్‌, పీడీలు సమాధానం చెప్పాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement