ఉద్యోగ భద్రత కల్పించాలి
జీతం పెంచి ఆదుకున్న జగనన్న
● సీఆర్‌ఎంటీల ఆవేదన ● ఉద్యోగ భద్రత కరువు ● రెగ్యులర్ చేయరు.. జీతాలు పెంపు లేదు
గుమ్మలక్ష్మీపురం:
వారంతా విద్యాభివృద్ధికి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో శ్రమ దోపిడికి గురవుతున్నారు. ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటీ లేక అల్లాడుతున్నారు. వారే సమగ్ర శిక్ష విద్యా శాఖలో మండల విద్యా వనరుల కేంద్రం, స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుబంధంగా పని చేస్తున్న సీఆర్‌ఎంటీలు. విద్యా శాఖలో భాగమైన వీరు మండల విద్యాశాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ ఎంల పర్యవేక్షణలో విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠ శాల ప్రారంభ సమయానికి ముందు పాఠశాలలకు వెళ్లి పర్యవేక్షణ చేయడం, డ్రాపౌట్ పిల్లల్ని బడిలో చేర్పించి విద్యార్థుల శాతాన్ని పెంచడం, మధ్యాహ్న భోజన పథకం పరిశీలన, పాఠశాలలకు యూనిఫా మ్స్, పాఠ్యపుస్తకాల సరఫరా, ప్రభుత్వ పరంగా పాఠశాలల్లో అమలయ్యే వివిధ కార్యక్రమాలను అనుసంధానం చేస్తుండడం వీరి కర్తవ్యం. వీరంతా విధులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నప్పటికీ.. వీరి సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తోంది. వీరికి న్యాయపరంగా కల్పించాల్సిన సదుపాయాలు కల్పించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. 2011 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3318 మంది వరకూ అన్ని మండలాల్లోని విద్యా వనరుల కేంద్రానికి అనుసంధానంగా సీఆర్‌ఎంటీలు పని చేస్తున్నారు. వీరంతా కొన్నాళ్లుగా తమను రెగ్యులర్ చేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కల్పించాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. తాజాగా గత నెల 15న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులంతా చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయినా చంద్రబా బు ప్రభుత్వం స్పందించి, డిమాండ్లు పరిష్కరించ డం లేదు. ఈ ఉద్యోగాన్నే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వీరిలో పలువురు అరవై ఏళ్లకు దగ్గర్లో ఉన్నారు. త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. రిటైర్మెంట్ అయ్యాక ఎటువంటి బెనిఫిట్స్ లేకపోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలోనన్న ఆందోళన వారిది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బేసిక్ పే స్కేల్ అమలు చేయాలి. టీఏ, డీఏ వర్తింపజేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగా లను క్రమబద్దీకరించే వరకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలి.
–ఎన్.కాంతారావు, ఏపీ సీఆర్‌ఎంటీ హక్కుల సాధన సమితి కన్వీనర్
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వీరు పడుతున్న ఇక్కట్లను గుర్తించి అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే (2020 మార్చి), వీరెవరూ ఎటువంటి డిమాండ్లు, నిరసనలు చేపట్టకుండానే రూ.17,755లు వేతనంతో ఉన్న వీరికి రూ.23,500కు పెంపుదల చేస్తూ, అంటే రూ. 5,745లు పెంపుదల చేసి సీఆర్‌ఎంటీలను ఆదుకున్నారు.


