పార్వతీపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతి అయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం (ఏడీపీ), ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 18లోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి పనులపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల వారీగా జరు గుతున్న పనుల స్థితిగతులను, సాధించిన ప్రగ తిని శాఖల వారీగా ఆరా తీశారు. జిల్లాలోని 10 పాఠశాలల్లో స్మార్ట్ ఐసీటీ ల్యాబ్‌ల ఏర్పాటు పనులు వేగవంతం కావాలని, ఎనిమిది పాఠ శాలల్లో జరుగుతున్న మరుగుదొడ్లు నిర్మాణ పనులను ఈ నెల 18 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని, సాగునీటి పనుల కోసం తగిన నోట్ ఫైల్ ను సిద్ధం చేసి ఆమోదానికి పంపాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్, సీపీఓ, పీఆర్, విద్యుత్, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: భూ రీ–సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని గిజబ గ్రామంలో జరుగుతున్న రీ–సర్వే పనులను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు చిన్న పొరపాట్లుకు కూడా తావు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్‌కు రెండు రోజుల ముందే రైతులకు నోటీసులు అందజేయాలని, ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ముందస్తు షెడ్యూల్ రూపొందించి రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని తెలిపారు. ప్రతీ రోజు ప్రగతి వివరాలను అప్‌డేట్ చేయడంతో పాటు ఎఫ్‌పీఓఎల్‌ఆర్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, నోషనల్ ఖాతాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. తోటపల్లి రిజర్వాయ ర్ పరిధిలో సరిహద్దు మార్కింగ్‌ను వెంటనే చేపట్టి, రీ–సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. రైతుల ఫిర్యా దులను వెంటనే పరిష్కరించి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పని చేయాల ని అధికారులకు సూచించారు. ఇన్‌చార్జ్ జేసీ పవర్ స్వప్నిల్, తహసీల్దార్ బాల, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సంయుక్త కార్యదర్శిగా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రౌతు ధావన్‌కుమార్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.


