15న సీతంపేటలో యోగాంధ్ర | - | Sakshi
Sakshi News home page

15న సీతంపేటలో యోగాంధ్ర

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

15న సీతంపేటలో యోగాంధ్ర

పార్వతీపురం: సీతంపేటలోని ఎన్టీఆర్‌ అడ్వెంచర్‌ పార్క్‌లో ఈ నెల 15న ఉదయం ఆరు గంటలకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి గురువారం తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌ సమస్యలను పార్వతీపురంలోని రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలు అందజేయవచ్చునని తెలిపారు. పాలకొండ డివిజన్‌కు సంబంధించిన రెవెన్యూ క్లినిక్‌ సీతంపేటలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జూన్‌ 22 నుంచి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం యధావిధిగా కలెక్టర్‌ కార్యాలయంలోనే నిర్వహిస్తామని, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement