‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీ రేపు | - | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీ రేపు

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీ రేపు ● మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర

● మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర

సాలూరు రూరల్‌: రాష్ట్రంలో చంద్రబాబు వెన్నుపో టు పాలనకు గుర్తుగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట ఈ నెల 12న సాలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నట్టు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర వెల్లడించారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చీకటి పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. మెగా డీఎస్పీ అంటూ నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు పాలనను నిరసిస్తూ చేపడుతున్న ర్యాలీలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఏనుగుల సమస్య పాలకులకు పట్టదా..

సాలూరు మండలంలో గత కొద్ది రోజులుగా ఏనుగులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమని రాజన్నదొర పేర్కొన్నా రు. సాలూరు నియోజకవర్గంలో ఏనుగులు ప్రవేశించి వారం రోజులు కావస్తున్నా తరలించే విషయంలో స్థానిక మంత్రి ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదన్నారు. ఒక వైపు గ్రామాల్లో ప్రవేశి స్తూ మరోవైపు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయ న్నారు. వ్యవసాయ బోర్లు పూర్తిగా నాశం చేస్తున్నాయని తెలిపారు. ఏనుగుల సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి సంధ్యారాణిపై ఉందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement