ఇరాన్‌లో చిక్కుకున్న చింతపల్లి యువకుడు | - | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో చిక్కుకున్న చింతపల్లి యువకుడు

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

ఇరాన్‌లో చిక్కుకున్న చింతపల్లి యువకుడు

పూసపాటిరేగ: మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఇరాన్‌ సమీపంలోని బందర్‌ అబ్బాస్‌ పోర్టు సమీపంలో తాను పనిచేస్తున్న ఎంవీ పాస్కల్‌ అనే నౌక మరమ్మతులకు గురవడంతో చిక్కకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. గ్రామానికి చెందిన కొమర సోమరాజు 12 నెలల క్రితం ఇరాన్‌కు ఏజెంట్‌ ద్వారా పని నిమిత్తం వెళ్లాడు. అక్కడ నౌకలో పనిచేస్తుండగా యుద్ధం నేపథ్యంలో బిక్కుబిక్కు మంటూ గడిపాడు. తాజాగా తాను ట్రైనీ వైపర్‌గా పనిచేస్తున్న ఎంవీ పాస్క్‌ల్‌ అనే నౌక మరమ్మతులకు గురవడంతో సముద్రంలోనే నౌకలో గడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఎంవీ పాస్కల్‌ నౌక మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పినట్లు చింతపల్లికి చెందిన మత్స్యకార నాయకుడు బర్రి చినఅప్పన్న తెలియజేశారు. సోమరాజుకు తల్లి కొమర అప్పమ్మ, తండ్రి కొమర అప్పన్న ఉన్నారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

ఇరాన్‌లో చిక్కకున్న చింతపల్లి గ్రామానికి చెందిన కొమర సోమరాజును స్వదేశానికి తెప్పించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవికి సోమరాజు కుటుంబసభ్యులు వినతిపత్రం అందజేశారు. సురక్షితంగా స్వదేశానికి వచ్చే విధంగా తమ వంతు సహకారం అందిస్తామని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement