బలిజిపేట: మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ నారీ యాప్‌తో అందరికీ మేలు జరుగుతుందని కలెక్టర్ ప్రభాక రరెడ్డి తెలిపారు. ఈ మేరకు బలిజిపేట మండలంలోని వెంగాపురంలో మన డబ్బులు–మన లెక్కలు అవగాహన ర్యాలీని ఆయన పచ్చజెండా ఊపి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీ చేసి మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీ ల్లో పూర్తి పారదర్శకత ప్రవేశపెట్టి మన డబ్బులు–మన లెక్కలు చూసుకునే విధంగా సూపర్ నారీ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీని పై అందరికీ అవగాహన కల్పించి దీని ప్రాధాన్యతలను వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండలస్థాయి అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
పార్వతీపురం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే జిల్లా రెండం స్థానంలో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాలో ఇంకుడు గుంతలు, ఇతర ఉపాధి పనుల్లో 10 లక్షల మార్కును దాటి దేశంలో రెండో స్థానాన్ని సాధించడం గర్వకారణమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన పీడీ డ్వామా, క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులను అభినందించారు. అదే సమావేశంలో ఆలయా ల పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించా రు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ: వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్‌బాబు ఇటీవల గుండెపోటుతో మరణించడం త్రీవ దిగ్భ్రాంతికి గురిచేసిందని పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మిపురం గ్రామానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రచర్ల పరీక్షత్ రాజు, మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి దంపతులతో కలిసి సోమవారం వెళ్లారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో పెందుర్తి మాజీ ఎమ్మేల్యేఅన్నమరెడ్డి అదీప్‌రాజు, పార్టీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి రామచంద్రరావు, పేల్లేటి వెంకటేష్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, పార్టీ మండల కన్వీనర్ ద్వారపురెడ్డి జనర్దనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కళింగి మల్లేశ్వరరావు ఉన్నారు.
బలిజిపేట: సారూ మా అబ్బాయి పేరు జి.హితీష్. 13 సంవత్సరాలు. మెదడు, కిడ్నీలు, శరీ ర అవయవాలు సక్రమంగా పనిచేయవు. మంచంపైనే అన్నీ. సేవచేసేందుకు ఓ మనిషి ఉండిపోవాలి. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తే కాళ్లు, చేతు లు కొట్టుకుంటాడు. ఇటువంటి వారికి రూ.15 వేల పింఛన్ ఇస్తారని తెలిసింది... ఇప్పించి ఆదుకోవాలంటూ వెంగాపురానికి చెందిన హితీష్ తల్లి జయలక్ష్మి, తండ్రి శంకరరావు కలెక్టర్ ప్రభాకర రెడ్డికి విజ్ఞప్తిచేశారు. వెంగాపురంలో పింఛన్ల పంపిణీలో సోమవారం కలెక్టర్ పా ల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుడి తల్లి దండ్రులు మాట్లాడుతూ ప్రస్తుతం రూ.6వేలు అందుతోందని, రూ.15 వేలు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలంటూ కలెక్టర్‌ను వేడుకున్నారు. దీనిపై పరిశీలిస్తామని, బాలుడిని దివ్యాంగుల పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, ఎంపీడీఓ శ్రీవాణి పాల్గొన్నారు.


